Rajadhani Files : అనుకున్నదే జరిగింది..

టాలీవుడ్ లో ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా యాత్ర 2 రిలీజ్ కాగా, కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. అయితే సినిమా ప్లాప్ కావడంతో హడావిడి తగ్గింది. ఇక ఈ సినిమా జగన్ బయోపిక్ గా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రం కూడా ఫిబ్రవరి 15న రిలీజ్ కావాల్సింది.

అన్ని అడ్డంకులు తొలగి రిలీజ్ అయింది అనుకున్న దశలో ఈ చిత్రానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం విడుదల నిలిపేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేసాడు. ఈ విషయంపై దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సినిమా పై తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఇక రేపు మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. అయితే ఏపీలో అమరావతి స్ధానంలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ స్ధానిక రైతులు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ వెబ్ సైట్ కు చెందిన నిర్మాణ సంస్ధ ఈ కథ నేపథ్యాన్ని రాజధాని ఫైల్స్ పేరుతో తెరకెక్కించింది. పెద్దగా క్యాస్టింగ్ ఎవరూ లేకున్నా చిన్న నటులతోనే తీసిన ఈ సినిమాలో ప్రస్తుత గవర్నమెంట్ ప్రతినిధుల పాత్రలను అంటే సీఎం జగన్, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని వంటి పలు పాత్రలు ఉన్నాయి. వీటిలో కొడాలి నాని సహా పలు పాత్రల్ని వ్యతిరేకంగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సెన్సార్ బోర్డు రాజధాని ఫైల్స్ చిత్రంలో పలు సీన్లు తొలగించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు వాటిని ఇప్పటికే తొలగించినట్లు చిత్ర నిర్మాతల తరఫు లాయర్ వాదించారు.

- Advertisement -

అయితే లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం రాజధాని ఫైల్స్ లోని దాదాపు సగం సీన్లు లేపేస్తే కానీ రిలీజ్ చేయడానికి ఎవ్వరూ అంగీకరించట్లేదని వార్తలు వస్తున్నా, ఇప్పటికే హైదరాబాద్ లాంటి పలు నగరాల్లో కొన్ని చోట్ల ప్రత్యేక షోలు వేసినట్టు సమాచారం. ఇక మహా అయితే రెండు రోజులు ఈ హడావిడి ఉంటుందని, ఈ లోపు సోషల్ మీడియాలో సినిమా చూసేస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా రాజధాని ఫైల్స్ ని ఏపీలో రిలీజ్ చేయకుండా ప్రస్తుత నేతలు తీవ్రంగా అడ్డుకుంటారని టాక్ నడుస్తుంది. మరి చూడాలి రేపు ఏం జరుగుద్దో.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు