Vishal : మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ తో డైరెక్టర్ గా మారబోతున్న విశాల్

తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తమిళంలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్ట్రాంగ్ ఫ్యాన్స్ బేస్ ఉంది. సౌత్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారు. రీసెంట్ గా “మార్క్ ఆంటోనీ”తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు. తన పాతికేళ్ల కల నిజమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని విశాల్ స్వయంగా బయట పెట్టారు. ఆయన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ తో దర్శకుడిగా మారుతుండడం క్యూరియాసిటీని పెంచేసింది. మరి విశాల్ మొట్ట మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఆ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ తో డైరెక్టర్ గా…
2017లో విశాల్ హీరోగా నటించిన “డిటెక్టివ్” మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీకి మిస్కిన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ ను ప్లాన్ చేశారు విశాల్. డిటెక్టివ్ 2 పేరుతో రూపొందనున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు మొట్టమొదటిసారిగా విశాల్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటిదాకా హీరోగా రాణించిన విశాల్ ఎట్టకేలకు తన పాతికేళ్ల కలను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. అయితే వాస్తవానికి సీక్వెల్ ప్లాన్ చేసినప్పుడు “డిటెక్టివ్ 2″కు కూడా విశాల్ ను హీరోగా, మిస్కిన్ ను డైరెక్టర్ గా కంటిన్యూ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ విశాల్ కు దక్కింది.

మిస్కిన్ కు స్పెషల్ థ్యాంక్స్…
ఈ విషయాన్ని విశాల్ స్వయంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి మరీ వెల్లడించారు. ఇండస్ట్రీలో తన 25 ఏళ్ల కల, ప్రయాణం మొదలైందని ఆయన అన్నారు. తన జీవితంలో తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆ కల, ఆకాంక్ష, తన మొదటి ఆలోచన నిజమయ్యాయని విశాల్ ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. అలాగే తన కెరీర్లో అత్యంత సవాళ్లతో కూడిన కొత్త బాధ్యతను తాను తీసుకుంటున్నానని, దర్శకుడిగా ఒక కొత్త ప్రయాణం మొదలైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక డిటెక్టివ్ 2 కోసం లండన్ బయలుదేరినట్టు, అజర్ బైజాన్, మాల్టాలో ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నట్టు అప్డేట్ ఇచ్చారు. అలాగే ఈ ప్రయాణం గురించి వివరించడానికి మాటలు రావట్లేదంటూ సంతోష పడిపోయాడు విశాల్. పడిన కష్టం ఎప్పుడూ వృధా కాదని తన తండ్రి జీకే రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ చెప్పిన మాటలను ఎప్పుడూ మర్చిపోనని విశాల్ ప్రామిస్ చేశాడు. ఇదే సందర్భంగా తనకు గుర్తింపును ఇచ్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.. ఇక ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్న తనకు అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగుతుందని ఆశించాడు విశాల్. తన కల ఇంత త్వరగా నిజం కావడానికి కారణమైన డైరెక్టర్ మిస్కిన్ కు విశాల్ ఈ వీడియో ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరి దర్శకుడుగా విశాల్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలియాలంటే డిటెక్టివ్ 2 తెరపైకి వచ్చేదాకా ఆగాల్సిందే.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు