February Box Office : మిడ్ రేంజ్ సినిమాలతో నిండిపోయిన ఫిబ్రవరి… ఎన్ని సినిమాలు క్యూలో ఉన్నాయంటే?

మరికొన్ని రోజుల్లో ఫిబ్రవరిలోకి అడుగు పెట్టబోతున్నాం. వచ్చే నెలలో సినిమాల జాతర జరగబోతోంది. చిన్న సినిమాలతో మొదలుకొని మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాల బాక్స్ ఆఫీస్ దుమ్ము రేగబోతోంది. ఏకంగా 14 సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి.

ఫిబ్రవరి 2న
ముందుగా ఫిబ్రవరి 2న “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” థియేటర్లలోకి రానుంది. ట్యాలెంటెడ్ హారో సుహాస్ నటించిన ఈ ఇంటెన్స్ విలేజ్ డ్రామాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్త దర్శకుడు దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాని కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 2న ఈ మూవీతో పాటు కిస్మత్, బూట్ కట్ బాలరాజు, హ్యాపీ ఎండింగ్ అనే చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఫిబ్రవరి 8న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ ‘యాత్ర 2’. ఆయన రాజకీయ ప్రయాణం, 2019 ఎన్నికల్లో ఆయన విజయాన్ని ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల కానుంది. ‘యాత్ర’లో మమ్ముట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో నటించారు. సీక్వెల్‌లో జీవా రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై బజ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

- Advertisement -

ఫిబ్రవరి 9న
ఫిబ్రవరిలో విడుదలవుతున్న సినిమాలన్నింటిలోకెల్లా పెద్ద మూవీ “ఈగల్”. రవితేజ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కార్తీక్ గడ్డంనేని దర్శకత్వం వహిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ సినిమాపై ఇప్పటికే అంచనాలను పెంచేసింది. రవితేజ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు.

ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న మరో సినిమా రజనీకాంత్ “లాల్ సలామ్”. అయితే తమిళ ప్రధాన భాషగా రూపొందిన ఈ మూవీపై తెలుగులో జీరో హైప్ ఉంది.

ఫిబ్రవరి 16న
వరుణ్ తేజ్ నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్-సెంట్రిక్ జానర్లో పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

ఫిబ్రవరి 16నే “ఊరి పేరు భైరవకోన” కూడా రిలీజ్ కానుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. ఈ థ్రిల్లర్ మూవీ గురించి ఇప్పటికే టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీతో పాటు సుందరం మాస్టర్, మేడం వెబ్ సినిమాలు రాబోతున్నాయి.

ఇక ఫిబ్రవరి 23న తిరగబడరా సామి, ఫిబ్రవరి 29న జోరుగా హుషారుగా షికారు పోదామా అనే చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు