Spark:మెహ్రీన్ ఇంత చేసినా… టాలీవుడ్ రిజెక్ట్ లిస్ట్ లోకి?

టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ ఫిర్జాదా తాజాగా ‘స్పార్క్’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలేవి లేకపోవడంతో ఆమె ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుంది. అయితే తాజాగా పరిస్థితి చూస్తుంటే మెహరీన్ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా అయిందని తెలుస్తోంది. నిజానికి ‘స్పార్క్’ అనే మూవీ రిలీజ్ అయ్యిందనే విషయం కూడా చాలామందికి తెలియనే తెలీదు. ఇక ఈ మూవీ టాక్ కూడా పెద్దగా లేకపోవడంతో ఆమెకు నెక్స్ట్ ఆఫర్స్ కరువు కావడం ఖాయం అంటూ టాక్ నడుస్తోంది.

విక్రాంత్ అనే కొత్త కుర్రాడు హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ వచ్చిన చిత్రం ‘స్పార్క్’. ఇందులో మెహరీన్ హీరోయిన్ గా నటించగా, మూవీపై నెగటివ్ టాక్ నడుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారిపోయింది. కృష్ణగాడి వీర ప్రేమగాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ఆమె అభిమానుల బాధపడుతున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే మెహరీన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ అనుకోకుండా వీరి పెళ్లికి బ్రేక్ పడింది. కారణం ఏంటన్న విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెను తీసుకోవడానికి తెలుగు మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ‘ఎఫ్ 3’లో మెహరీన్ కన్పించినా కూడా, ఆ సినిమా ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.

ఈ యంగ్ బ్యూటీకి ఇంత అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ కెరియర్లో తప్పటడుగు కారణంగా మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక తన రీఎంట్రీతో మళ్లీ టాలీవుడ్ లో జోరు కొనసాగించాలని భావించిన మెహరీన్, నేటి తరానికి తగ్గట్టుగానే ఆలోచించి ఓ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా కనిపించి షాక్ ఇచ్చింది. అయితే ఆమె దురదృష్టం కొద్ది అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘స్పార్క్’ పైనే ఉండగా ఆ సినిమా కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో పాపం మెహరీన్… ఇంత చేసినా కూడా టాలీవుడ్ రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ లిస్టులోకే చేరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ దర్శకుడైనా మెహ్రీన్ కు లైఫ్ ఇచ్చే ధైర్యం చేస్తాడా ? అనేది చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు