Dunki Postponed: షారుక్ బ్యాక్ స్టెప్…? దీపావళి రోజే ట్విట్టర్‌లో క్లారిటీ

ఆడియన్స్ అందరూ ఇప్పుడు డిసెంబర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ పోటీలో సలార్ సినిమాతో ప్రభాస్, డుంకీ సినిమాతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉన్నాడు. అలాగే హాలీవుడ్ నుంచి ఆక్వామెన్ కూడా రాబోతుంది. ఆక్వామెన్ ఎంట్రీని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆక్వామెన్ పోటీలో ఉండటం ఇటు షారుక్ ఖాన్‌కి, అటు ప్రభాస్‌కి నష్టమే.
అలా అని ఇద్దరు కూడా వెనక్కి తగ్గడానికి రెడీగా లేరు. ప్రభాస్ సలార్ మూవీ అయితే ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. మళ్లీ డిసెంబర్ 21 నుంచి వాయిదా వేయాడానికి ప్రభాస్ గానీ, మూవీ టీం గానీ రెడీగా లేదు. ఇక వాయిదా గురించి ఆలోచించాల్సింది బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మాత్రమే.

ఎందుకంటే.. షారుక్ హ్యట్రిక్.. 1000 కోట్ల కలెక్షన్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ సారి షారుక్ నుంచి పఠాన్, జవాన్ కంటే… ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ లో సలార్.. ఆక్వామెన్ పోటీలో ఉన్నప్పుడు డుంకీ 1000 కోట్లు తీసుకురావడం చాలా కష్టం. సలార్ ప్రభావం నార్త్ స్టేట్స్ లో ఉంటే.. ఆక్వామెన్ ప్రభావం ఓవర్సీస్ లో ఉంటుంది. అందుకే మూవీ టీం కూడా సినిమాని వాయిదా వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

దీనిపై షారుక్ ఖాన్ కూడా స్వయంగా ఓ క్లూ ఇచ్చాడు. ఇటీవల దీపావళి సందర్భంగా మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఎక్కడా కూడా మూవీ రిలీజ్ డేట్ డిసెంబర్ 22న అని చెప్పలేదు. అలాగే పోస్టర్ రిలీజ్ టైంలో షారుక్ ఖాన్ తన ట్విట్టర్ లో తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షులు రాసుకొచ్చాడు. చివర్లో తమ డుంకీ సినిమాను క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇక్కడే అనుమానాలు అన్ని. డుంకీని ఎట్టిపరిస్థుతుల్లో డిసెంబర్ 22నే విడుదల చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ, దీపావళి పోస్ట్ లో షారుక్ డిసెంబర్ 22న కాకుండా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది అని మెన్షన్ చేశాడు. దీంతో డుంకీ వాయిదా దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. అయితే దీని తర్వాత గత రెండు రోజుల నుంచి డుంకీ వాయిదా అవ్వడం లేదు అని ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటి వరకు డుంకీ టీం.. వాయిదా గురించి కానీ, వాయిదా లేదు అనే దాని గురించి కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

అయితే బీ టౌన్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. డుంకీ మూవీని డిసెంబర్ 24 లేదా 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు రోజుల్లో సలార్, ఆక్వామెన్ కు ఆడియన్స్ తగ్గిపోతే.. అది తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు