Prakash Raj Comments: మళ్లీ సిని”మా” రాజకీయాం… హీరో విష్ణు జీరో అంటున్న ప్రకాశ్ రాజ్

సరిగ్గా రెండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడీ కనిపించింది. ఓ వైపు ప్రచారం… మరో వైపు విమర్శలు.. కౌంటర్ ఎటాక్స్… అంతు లేని హామీలు ఇలా వాడీ వేడిగా రాజకీయాలు జరిగాయి. ఏంటి రెండేళ్ల క్రితం అంత సీరియస్ గా ఏం ఎన్నికలు జరిగాయి అనుకుంటున్నారా? అదేనండి… మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ (MAA) ఎలక్షన్స్.

మంచు విష్ణు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మధ్య జరిగిన ఈ ఎలక్షన్స్.. సాధారణ ఎన్నికల కంటే.. హోరా హోరిగా సాగాయి. ఎన్నో నాటకీయ పరిస్థితుల మధ్య మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించింది. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. దీని తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచినవాళ్ళు రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ (MAA) ఎలక్షన్స్ దగ్గరికి వచ్చింది. అంటే… సిని”మా” పాలిటిక్స్ మళ్లీ స్టార్ట్ కాబోతున్నాయి. ఆ వేడి ఇప్పుటి నుంచే స్టార్ట్ అవుతుంది.

తాజాగా అప్పుడు ఓడిపోయిన ప్రకాశ్ రాజు… సిని”మా” రాజకీయాన్ని ఇప్పుడే స్టార్ట్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇప్పటి మా అధ్యక్షుడు మంచు విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్ల నుంచి విష్ణు చేసింది జీరో అని విమర్శించాడు. రెండేళ్ల గడుస్తున్న ఒక్క జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదని, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మా భవనం గురించి ఇంత వరకు ఏం మాట్లాడలేదు అంటూ విమర్శించాడు. కార్యవర్గంలోని సభ్యులు ఇప్పటికైనా ఆలోచించాలని అన్నాడు.

- Advertisement -

అలాగే మంచు విష్ణు బోగస్ ఓట్లు, బయటి నుంచి వచ్చిన ఓట్లతోనే గెలిచాడు అంటూ ఆరోపించాడు. అయితే తాను వచ్చే మా అధ్యక్ష పోటీల్లో ఉండే అవకాశాలు లేవని చెప్పారు. ప్రస్తుతం తన ఫోకస్.. జాతీయ రాజకీయాలపై ఉందని, అలాంటి పరిస్థితుల్లో మా అధ్యక్ష పోటీలో ఉండలేను అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రకాశ్ రాజ్ వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉన్నా లేకున్నా.. వచ్చే మా అధ్యక్ష పోటీలు అయితే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలతో వేడేక్కిందని చెప్పొచ్చు. అయితే దీనిపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు