Kollywood: వీళ్ళకి ఇస్తారా..? ఇచ్చినా మనోళ్లు చూస్తారా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి భారీగా సినిమాలు రాబోతున్నాయి. ఇంతకు ముందు ప్రతి సంవత్సరం రెండు లేదా మూడు సినిమాలు మాత్రమే పొంగల్ కి రిలీజ్ అయ్యేవి. చిన్న సినిమాలు ఎక్కువ ఉంటే మహా అయితే నాలుగు వచ్చేవి. అయితే ఈ ఇయర్ మాత్రం మీడియం రేంజ్ సినిమాతో కలిపి స్టార్ హీరోల సినిమాలు ఐదు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఐదు సినిమాలు రిలీజ్ డేట్ ని పక్కాగా లాక్ చేసుకోగా, థియేటర్ల సమస్య మాత్రం ఇప్పటికి అలాగే ఉంది. ఏ సినిమాకి ఎక్కువ ఇవ్వాలో తేలిక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తేల్చుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంచితే తెలుగు సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసినట్లే తమిళ సినిమాలను కూడా అక్కడ పొంగల్ కి రిలీజ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తారు. ఇక ఆ సినిమాలను తెలుగు లో కూడా పండక్కి డబ్ చేస్తారు మేకర్స్. ఆ సినిమాలు ఒక్కోసారి తెలుగు సినిమాలని మించి కూడా బాగా ఆడతాయి. ఇక లాస్ట్ టైం కూడా తెలుగులో విజయ్ వారిసు, అజిత్ తునీవు డబ్ చేసారు. ఇక ఈ సంక్రాంతి కి కూడా తెలుగు లో డబ్బింగ్ సినిమాలని రిలీజ్ చేయడానికి తమిళ్ మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. వాటిలో అయలాన్, లాల్ సలాం తో పాటు కెప్టెన్ మిల్లర్ కూడా ఉన్నాయి.

అయితే టాలీవుడ్ లో ఈసారి థియేటర్ల కేటాయింపు పరిస్థితి చాలా కష్టంగా మారింది. ఉన్న తెలుగు సినిమాలనే థియేటర్లు దొరక్క వాయిదా వేయమని నిర్మాతలని రిక్వెస్ట్ చేసే పరిస్థితి నెలకొని ఉంది. అలాంటిది ఆరవ సినిమాలకు థియేటర్లు ఎలా కేటాయించాలని దిల్ రాజు కూడా ఓ ప్రెస్ మీట్ లో అన్నారు. ఒక వేళ ఇచ్చినా ఎంత పెద్ద హీరో సినిమా అయినా, ప్రస్తుతం వంద థియేటర్ల కి మించి ఇచ్చే ఛాన్స్ లేదు. థియేటర్ల మాట అటుంచినా అరవ సినిమాలు పొంగల్ కి వచ్చినా ఇన్ని తెలుగు సినిమాలని పక్కన బెట్టి వాటికి ప్రేక్షకులు ఓటేస్తారా అంటే ఛాన్సే లేదనాలి. అలాంటప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను సంక్రాంతి అయిపోయిన తరువాత ఇక్కడ రిలీజ్ చేస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి దీని గురించి టాలీవుడ్ నిర్మాతలు ఏం డిసైడ్ అయ్యారో చూడాలి.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు