Lal Salaam: బహిరంగంగా మాజీ భార్యతో ధనుష్ ఫైట్… ఇది ఎక్కడికి దారి తీస్తుందో!

అవును… ధనుష్ తన భార్యతో బహింరంగంగానే ఫైట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకోబోతున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించి సూపర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే, 18 ఏళ్ళ తమ వివాహ బంధానికి 2022లో ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టారు.విడాకులకు కారణం ఏంటో అధికారికంగా వీరిద్దరూ చెప్పనప్పటికీ, విభేదాలే ప్రధాన కారణమని సమాచారం. అంతరం వీరిద్దరూ మళ్ళి ఒక్కటవ్వబోతున్నారు అనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. వారిద్దరూ విడిపోయినప్పటికీ తమ కుమారులు యాత్ర, లింగాలకు మాత్రం తల్లిదండ్రులుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ మాజీ జంట మరోసారి మరోసారి ఫైట్ కు సిద్ధమైంది. కానీ అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అసలు విషయం ఏమిటంటే ?

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ “లాల్ సలామ్”, ఐశ్వర్య ఇప్పటికే 3, వై రాజా వాయ్ అనే రెండు సినిమాలకు దర్శకత్వంగా వహించగా, ఇది ఆమెకు మూడవ చిత్రం. ఇందులో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలలో, సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో కపిల్ దేవ్ కూడా కనిపించబోతున్నారు. 2024 పొంగల్‌కు అత్యంత్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ స్క్రీన్‌లలోకి తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాతలు అక్టోబర్ 3న ప్రకటించారు.

మరోవైపు ధనుష్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ “కెప్టెన్ మిల్లర్“. “కెప్టెన్ మిల్లర్‌”కి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ , ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, నాజర్, వినోద్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక “కెప్టెన్ మిల్లర్‌” మూడు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. అంతేకాదు ఈ మూవీని కూడా సంక్రాంతి బరిలో దింపడానికి రెడీ అయ్యారు. దీంతో ఈ మాజీ జంట మధ్య బహిరంగంగానే ఫైట్ స్టార్ట్ అయ్యింది. అంతేకాదు ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ సూపర్ స్టార్, ధనుష్ మధ్య అన్నట్టుగా మారిపోయింది. అంతేకాదు ఈ వార్ లో ఐశ్వర్య గెలుస్తుందా? లేక ధనుష్ గెలుస్తాడా? అనేది ఆసక్తి కరంగా మారింది. మరి ఈ ఫైట్ ఎక్కడకు దారి తీస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు