Devil : రాంగ్ స్టెప్… ఆ ఒక్క తప్పుడు నిర్ణయంతో కోట్ల నష్టం

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “డెవిల్” మూవీ పెద్దగా అంచనాలు లేకుండానే డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే టాగ్ లైన్ తో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. కానీ ప్రస్తుతం థియేటర్లలో ఈ మూవీ స్పీడ్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం అనే అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే నిర్మాతలు చేసిన ఈ ఒక్క తప్పుతో కోట్లలో నష్టాన్ని చవి చూడక తప్పదు. మరి “డెవిల్” మేకర్స్ వేసిన ఆ రాంగ్ స్టెప్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా రూపొందిన స్పై థ్రిల్లర్ మూవీ “డెవిల్”. అభిషేక్ మామ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు స్వయంగా నిర్మించారు. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వాళ్ళు రిలీజ్ డేట్ విషయంలో చేసిన తప్పుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. 45 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ రిలీజ్ డేట్ కారణంగా నిర్మాతలు భారీ నష్టాలను ఎదురుకోక తప్పేలా లేదు. ఇంతటి భారీ బడ్జెట్ పెట్టినప్పుడు సినిమాకు సరైన రిలీజ్ డేట్ ను ఎంచుకోవడం అనేది చాలా కీలకం. ముఖ్యంగా మంచి కంటెంట్ ఉంది ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు చిత్ర నిర్మాతలు మూవీ రిలీజ్ కోసం పండగ సీజన్లను టార్గెట్ చేసుకోవాలి. లేదా ఇతర సినిమాల నుంచి పెద్దగా ఎఫెక్ట్ లేని సోలో రిలీజ్ డేట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ప్రస్తుతం “డెవిల్” విషయంలో ఈ రెండు జరగలేదు. డిసెంబర్ 29న “డెవిల్” మూవీ రిలీజ్ కావడం వల్ల రెండు భారీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి “సలార్” మూవీ, రెండు సంక్రాంతి సినిమాలు. ఇప్పటికే “సలార్” మేనియా ఇంకా కొనసాగుతోంది. దీంతో ఇతర సినిమాలపై ప్రేక్షకులు చాలా తక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక మరో రెండు వారాల్లో సంక్రాంతికి ఏకంగా నాలుగైదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో “డెవిల్”ను అన్ని థియేటర్ల నుంచి పక్కన పడేస్తారు.

ఈ రెండింటి ఎఫెక్ట్ “డెవిల్” పై చాలా దారుణంగా ఉండబోతోంది. యావరేజ్ మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూ లతో ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతున్న “డెవిల్ ” రిలీజ్ విషయంలో మేకర్స్ ఇలా రాంగ్ స్టెప్ వేసి, పెద్ద రిస్క్ లో పడ్డారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 20 కోట్లకు పైగా షేర్లను రాబట్టాలి. కానీ ఫస్ట్ డే “డెవిల్” 2 కోట్ల కంటే తక్కువ షేర్ లనే సాధించింది. కనీసం వీకెండ్ కైనా బుకింగ్ లు జోరందుకుంటాయేమో అంటే అదీ లేదు. ఈరోజు కూడా మొదటి రోజులాగే ఉంది. బుకింగ్స్ లో పెద్ద తేడా ఏం లేదు. ఇక సంక్రాంతి వరకు ఇదే జోరు కొనసాగిస్తే “డెవిల్” సింగిల్ డిజిట్ క్లోజింగ్ షేర్ గా ముగిసి, నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తుంది. అలాగే బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమేనని చెప్పాలి. కేవలం డిసెంబర్ 29న రిలీజ్ చేయడమే “డెవిల్” మూవీ విషయంలో మేకర్స్ చేసిన అతి పెద్ద తప్పు.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు