Chiru – Balayya: మరోసారి సంక్రాంతి పోటీకి రెడీ ?

ఈ ఏడాది సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగింది. టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య తో పాటు కోలీవుడ్ అగ్ర హీరోలు దళపతి విజయ్, తల అజిత్ కుమార్ ఈ సారి సంక్రాంతి పోటీలో ఉన్నారు. అయితే ఈ రేసులో తెలుగు ప్రేక్షకుల చూపు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు భారీ విజయాన్ని నమోదు చేశాయి.

అయితే కలెక్షన్ల పరంగా చూస్తే, వాల్తేరు వీరయ్య కొంత వరకు మెరుగ్గా ఉంది. దీంతో 2023 సంక్రాంతి విజేతగా మెగాస్టార్ చిరంజీవి నిలుస్తున్నాడని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. 2023 సంక్రాంతి వేడి తగ్గక ముందే, 2024 సంక్రాంతి పోటీ గురించి ఇప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమా చేయాలని నందమూరి బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న NBK108 షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. నవంబర్ వరకు అన్ని పనులు ముగించుకుని, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోయే సంక్రాంతి రేసులో ఉండాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 30 శాతం మేర షూటింగ్ జరుపుకుందని స్వయంగా మెగాస్టార్ వెల్లడించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. భోళా శంకర్ స్క్రిప్ట్ లో చాలా వరకు మార్చారట. వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించడంతో, ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికి మెహర్ రమేష్ పలు మార్పులు చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్లను రీ షూట్ కూడా చేయాల్సి వస్తోందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా పూర్తి అవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ఇది కూడా సంక్రాంతి బరిలో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద మరోసారి అగ్ర హీరోల పోరు తప్పదు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు