మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టిన రామ్ చరణ్, స్టార్ హీరో ట్యాగ్ రావడానికి చాలానే కష్టపడ్డాడు. మొదటి సినిమా ’’చిరుత’’ తో కొంత వరకు రామ్ చరణ్ ఆకట్టుకున్నాడు. తర్వాత రాజమౌళి “మగధీర”తో చరణ్ కు సెన్సెషనల్ హిట్ అందించాడు. దీని తర్వాత అంతటి హిట్ ’’రంగస్థలం’’తోనే సాధ్యమైంది. లేటెస్ట్ గా ’’ఆర్ఆర్ఆర్’’ మూవీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు చరణ్.
ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ’’ఆర్ సీ 15’’ అనే వర్కింట్ టైటిల్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో కీయారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన పోస్టర్లతో అంచనాలు భారీగానే పెరిగాయి. దీని తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లో “ఖైదీ, మాస్టర్” తో పాటు కమల్ హాసన్ తో “విక్రమ్” సినిమాలు చేస్తున్న లోకేశ్ కనగరాజు తో మెగా పవర్ స్టార్ సినిమా చేయబోతున్నాడట. లోకేశ్ కనగ రాజ్ చెప్పిన స్టోరీకి రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే ఓకే చెప్పాడని సమాచారం.
ఇదిలా ఉండగా, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లోనే వెళ్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ఇప్పటికే శంకర్ తో చేస్తుండగా, ఇప్పుడు లోకేష్ కనగరాజుతో చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే తెలుగులో చిన్న డైరెక్టర్లు కూడా పెద్ద హిట్స్ కొడుతున్నారు. ఈ తరుణంలో వారిని కాదని రామ్ చరణ్ కోలీవుడ్ వైపే ఎందుకు అడుగులు వేస్తున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.