కొరటాల శివ
మిర్చి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయారు,
ఎప్పుడొచ్చం అన్నది కాదు బులెట్ దిగిందా లేదా అన్నట్లు
కొరటాల అలా వచ్చి ఇలా ఆడియన్స్ గుండెల్లో గుర్తుండిపోయే సినిమాలు చేసారు,కానీ రీసెంట్ టైం లో చేసిన ఆచార్య సినిమా మర్చిపోలేని చేదు అనుభవాన్ని ఇచ్చింది.
గాయపడిని సింహాం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్న భయంకరంగా ఉంటుందని చెప్పినట్లు ఓటమి నుండి బయటపడి, కెరియర్ లో తనను తాను నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కొరటాల శివ.
కొరటాల ప్రస్తుతం తారక్ తో సినిమాను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. మే 20న తారక్ పుట్టినరోజు సందర్బంగా Fury of #NTR30 అనే 47 సెకన్ల నిడివి ఉన్న వీడియోను నేడు రిలీజ్ చేసారు.
ఈ వీడియోలో తన పెన్ పదును చుపించాడు కొరటాల.
“అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తాను ఉండకూడదని.
అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని.
వస్తున్నా”…
అని తారక్ చెప్పే డైలాగ్, ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది, తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.