Anupama parameshwaran నిర్మాతలను టార్చర్‌ పెడుతున్న అనుపమా ?

Anupama parameshwaran

టాలీవుడ్ హీరోయిన్లకు పాన్ ఇండియన్ రేంజ్ వస్తే చాలు చాలా మారిపోతున్నారట. చూడడానికి అమాయకంగా కనిపించినప్పటికీ ప్రొడ్యూసర్లకు చుక్కలు చూపిస్తున్నారట. ఆ హీరోయిన్లు మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్, మృణాల్ ఠాకూర్. ఈ ఇద్దరు హీరోయిన్లు మంచి పాన్ ఇండియా రేంజ్ వచ్చిన వెంటనే ఒక్కసారిగా అందరికీ చుక్కలు చూపిస్తున్నారట.

పక్కింటి అమ్మాయిల ఎంతో అందంగా ఉండే అనుపమ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రొడ్యూసర్లను తెగ ఇబ్బంది పెడుతుందట. కార్తికేయ-2 సినిమా వరకు ఈ భామ ప్రవర్తన ఎంతో బాగుందని….ఆ సినిమా అనంతరం పాన్ ఇండియా హిట్ తర్వాత తన ఆటిట్యూడ్ చాలా మారిపోయిందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమాల్లో ఎప్పటిలానే నటిస్తుంది. కానీ ప్రమోషన్స్ కి రమ్మంటే తప్పించుకొని తిరుగుతుందట. తాజాగా అనుపమ నటించిన చిత్రం ఈగల్.

ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రవితేజ సరసన జతకట్టింది అనుపమ. కానీ ప్రమోషన్స్ కి రమ్మంటే అస్సలు రావడం లేదట. ప్రమోషన్స్ కి రమ్మంటే ఇంత బిల్డప్ ఇస్తుంది ఏంటి… ఈమె ఏమైనా స్టార్ హీరోయినా…. రెమ్యూనరేషన్ పెంచినప్పటికీ ఒప్పుకొని ఈ అమ్మడిని హీరోయిన్ గా పెట్టుకుంటే బాగానే బుద్ధి చెబుతుందంటూ అంటున్నారు ఈగల్ మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఆటిట్యూడ్ ని చూపిస్తోందట. తాను నటించిన రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. బాలీవుడ్ లో ఎంత నటించినప్పటికీ పెద్దగారాని గుర్తింపుని టాలీవుడ్ లో కేవలం రెండు సినిమాలతోనే తెచ్చుకుంది ఈ అమ్మడు.

- Advertisement -

హీరోలు, దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తోందట. “హాయ్ నాన్న”, “ఫ్యామిలీ స్టార్” సినిమాలో ల్ కిమృణాల్ ప్రవర్తన చూసిన తర్వాత మృణా సినిమా అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు భయపడిపోతున్నారట. అందం, యాక్టింగ్ ఉన్నప్పటికీ డిసిప్లేన్ లేకపోతే సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరు పెద్దగా ముందుకురారు. షూటింగ్స్ కి లేటుగా రావడం, ప్రమోషన్స్ కి రాకుండా ఉండడంతో ఈ ఇద్దరు హీరోయిన్ల ప్రవర్తన పట్ల మేకర్స్ విసిగిపోయారట. మరి వీరిద్దరికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు