Akhil : మరో స్టార్

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో అక్కినేని అఖిల్. ఇప్పుడు ఏజెంట్ గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి ఈ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, పలువురు బడా నటులు కీలకపాత్రలను పోషిస్తున్నారు.

తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే సినిమాపై అనేక రూమర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ వార్తల ప్రకారం రాజ్ వంటి చిత్రంలో కనిపించిన డినో మోరియా నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి తదితరులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు