‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ అండ్ టీం చేసిన ప్రాంక్ వీడియో పై కేసు నమోదవ్వడం దాని పై టీవీ 9 లో డిబేట్ నిర్వహించడం… అక్కడ జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే.యాంకర్ దేవీనాగవల్లి,హీరో విశ్వక్ సేన్ ల మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుంది.ఇది స్క్రిప్టెడ్ అని ముందు అందరూ అనుకున్నారు. కానీ తలసాని వరకు విషయం వెళ్లడంతో ఇది నిజమే అని తేలింది.అయితే నాగవల్లి చేసిందే తప్పు… పాగల్ సేన్, డిస్టర్బ్డ్ పర్సన్ అంటూ అవతలి వ్యక్తిని నిందించడం తప్పు అంటూ అందరూ ఆమెను ట్రోల్ చేశారు. కానీ విశ్వక్ సేన్ కూడా అక్కడ వాడకూడని పదం వాడినందుకు అతని పై మంది పడ్డ న్యూస్ రీడర్ల బ్యాచ్ లేకపోలేదు.
అయితే ఈ వివాదం సినిమాకి కాస్త పబ్లిసిటీని తీసుకొచ్చింది. అయితే.. విశ్వక్‌సేన్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడుతుందనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. అందుకే విశ్వక్ సేన్ వివాదాన్ని చక్కదిద్దడానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. టీవీ 9 అధినేతలతో అరవింద్ గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక విశ్వక్ సేన్ తో ఆయన చిన్న బ్యానర్లో ఓ సినిమా చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి.. నాగవల్లిని టీవీ9 పెద్దల ఎదుటికి పిలిపించి మాట్లాడి… భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో విశ్వక్- నాగవల్లి ల మధ్య వివాదం సద్దుమణిగింది అని చెప్పాలి.