Akhil: ‘ఏజెంట్’ అఖిల్ స్టామినాకి పరీక్ష..!

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ‘ఏజెంట్’ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. 80కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. మొదట్లో 25కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలైన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడటం వల్ల బడ్జెట్ 80కోట్లకు చేరింది. అటు అఖిల్ కెరీర్ కి, ఇటు సురేందర్ రెడ్డి కెరీర్ కి హిట్ కీలకమైన దశలో వస్తున్న ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది సినిమా యూనిట్.

టీజర్ రిలీజ్ తో ఓ మోస్తరు బజ్ క్రియేట్ చేయగలిగిన ఏజెంట్ ఆ తర్వాత బజ్ ని క్యారీ చేయలేకపోగా సినిమాపై నెగిటివిటీ పెరిగింది. ఇటీవల సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందువరకూ మినిమమ్ హైప్ కూడా లేని ఈ సినిమాకు ట్రైలర్ తర్వాత హైప్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అఖిల్ స్టామినాకి ఏజెంట్ సినిమా పెద్ద పరీక్ష అని అంటున్నారు. అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా కావటం, ఇంతవరకు ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా అఖిల్ కెరీర్లో లేకపోవటంతో ఏజెంట్ సినిమా అఖిల్ స్టామినాకి పరీక్షగా మారింది.

స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమాకు పోటీగా విరూపాక్ష మినహా పెద్ద సినిమాలేవీ పోటీలో లేకపోవటంతో ప్లస్ అయ్యే అవకాశం ఉంది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నప్పటికీ ఆ సినిమాకు పెద్దగా బజ్ లేకపోవటం వల్ల నష్టమేం లేదు. కాకపోతే విరూపాక్ష ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో ఏజెంట్ కి గట్టి పోటీ ఏర్పడిందనే చెప్పాలి.ఏజెంట్ సేఫ్ జోన్ కి చేరుకోవాలంటే మంచి ఓపెనింగ్స్ ని రాబట్టాలి. అంతే కాకుండా హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకులను మినిమమ్ రెండు వారాల పాటు థియేటర్లకు వచ్చేలా చేయాలి. అలాంటప్పుడే ఏజెంట్ లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది. మరి, అఖిల్ మార్కెట్ రేంజ్ కి మించిన బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాతో హిట్ అందుకొని అఖిల్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడతాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు