Baby : ప్లాప్ అందుకున్న బేబీ లో ఆ ఇద్దరు? ఇక ఈ ఒక్కడికైనా హిట్ దక్కుతుందా?

Baby : టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా “బేబీ”. శ్రీనివాస్ కుమార్ నాయుడు నిర్మించిన ఈ సినిమాను సాయి రాజేష్ నీలం తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించగా వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్ గా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఊహించని ఘన విజయం సాధించింది. నిజానికి ఈ సినిమా స్టోరీ పెద్దగా ఉండదు. టీనేజ్ లో ఉండే అట్రాక్షన్ కి యువత ఎలా బలైపోతుందో ప్రాక్టికల్ గా కాస్త బోల్డ్ అంశాలతో తెరకెక్కించారు మేకర్స్. ఒక మాటలో చెప్పాలంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనొచ్చు. ఎన్నో వివాదాలు, విమర్శలతో థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా (Baby) బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ విజయం సాధించింది. ఇక ఈ సినిమాతో మెయిన్ లీడ్స్ గా నటించిన ముగ్గురికి మంచి పేరు వచ్చింది. ఇదిలా ఉండగా ఈ ఇయర్ లో ఈ ముగ్గురు వేర్వేరుగా నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి.

After the hit Baby, will Anand Devarakonda get another hit with Gam Ganesha?

ఇద్దరికి ప్లాప్.. మరి మూడో వాడు.?

ఇక లాస్ట్ ఇయర్ బేబీ సినిమా సక్సెస్ తో గుర్తింపు పొందిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ఇప్పుడు వేర్వేరు సినిమాలతో ఈ ఏడాది వచ్చారు. అయితే ఈ సారి మాత్రం వీళ్ళకి కలిసొచ్చేలా లేదు. రీసెంట్ గా విరాజ్ అశ్విన్ హీరోగా శ్రీ రంగ నీతులు అనే సినిమాలో నటించాడు. నెలన్నర కింద రిలీజ్ అయిన శ్రీ రంగ నీతులు అసలు ఎప్పుడొచ్చిందో కూడా జనాలకు తెలీదు. అలా విరాజ్ అశ్విన్ ప్లాప్ అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా హీరోయిన్ వైష్ణవి చైతన్య లవ్ మీ సినిమాతో హీరోయిన్ గా నిన్న ,(మే 25) న ప్రేక్షకులని పలకరించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలా బేబీ తో బిగ్ సక్సెస్ చూసిన యువ నటీనటులు మళ్ళీ వెంటనే డౌన్ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఆనంద్ దేవరకొండ వంతు వచ్చింది.

- Advertisement -

ఈ వారమే గం గణేషా..

ఇక ఆనంద్ దేవరకొండ ‘గమ్ గమ్ గణేష్’ అనే సినిమా ద్వారా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటించింది. ఉదయ్ శెట్టి అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక అదే రోజు సత్యభామ, ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ లాంటి క్రేజీ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఇంత పోటీలో గం గణేషా ప్రేక్షకులని ఎలా అలరిస్తాడో చూడాలి. ఇక బేబీ తర్వాత విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్లాప్ అందుకోగా, ఇప్పుడు ఆనంద్ దేవరకొండ కి అయినా హిట్ వస్తుందా? లేక వాళ్ళలా మరో ప్లాప్ అందుకుని పరిపూర్ణం చేస్తాడా అనేది చూడాలి. అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం గం గణేషా కామెడీ తో నిండి ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కాబట్టి ఏమైనా కంటెంట్ కొద్దిగా బాగున్నా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు