Hema: కులాంతర వివాహం.. కట్ చేస్తే..!

Hema.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హేమా లేడీ కమెడియన్ గా కూడా మరింత పేరు దక్కించుకుంది.. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమా ఉండడమే.. పైగా ఆమెకు నిర్వహించిన టెస్ట్ లలో పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ హేమా గురించి చర్చించుకుంటున్నారు.. ముఖ్యంగా కరాటే కళ్యాణి , తమన్నా సింహాద్రి లాంటి నటులు కూడా హేమా గుట్టు రట్టు చేసే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఈమెపై రకరకాల విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు చేయడం సంచలనానికి దారి తీస్తోంది..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 400కు పైగా సినిమాలలో అవకాశం..

Hema: Inter-caste marriage.. if cut..!
Hema: Inter-caste marriage.. if cut..!

ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.. అందులో భాగంగానే ఈమె ప్రేమ, పెళ్లి విషయం కూడా ఒకటి.. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు దాదాపు 400 చిత్రాలకు పైగానే నటించిన హేమా ఇప్పుడు అడపాదడపా సినిమాలలో కనిపిస్తోంది. మరి ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1967 తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో జన్మించిన హేమ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.. ఈమె పేరు కృష్ణవేణి కాగా సినిమాల్లోకి వచ్చాక హేమా గా పేరు మార్చుకుంది. ఆ తర్వాత క్షణక్షణం సినిమాలో శ్రీదేవి ఫ్రెండ్ గా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది..

హేమా ప్రేమ, పెళ్లి..

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రముఖ కెమెరామెన్ సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమించి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పెళ్లి చేసుకుంది.. ఇక చిన్న వయసులోనే వివాహం చేసుకోవడంతో ఇంట్లో వాళ్ళు ఈమెపై పూర్తిస్థాయిలో మండిపడ్డారు.. ఇదే విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. దూరదర్శన్ లో పనిచేస్తున్నప్పుడు అక్కడ అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేస్తున్న నా భర్త సయ్యద్ జాన్ అహ్మద్ పరిచయమయ్యారు.. అయితే ఒకసారి మా ఇద్దరికీ ఫస్ట్ మీటింగ్ జరగగా… జూన్లో పెళ్లి చేసుకుంటానని చెప్పారు.. అప్పుడు నా వయసు కేవలం 18 మాత్రమే.. అయితే కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు అంటే మోసం చేసే వ్యక్తి కాదని ఒకే చెప్పాను.. ఆ తర్వాత మా పెళ్లి జరిగింది.. ఇక మా పెళ్లి బంధానికి గుర్తుగా ఒక పాపకు జన్మనిచ్చాము. ఆ పాప పేరు ఈషా.. అంటూ చెప్పుకొచ్చింది..

- Advertisement -

హేమా భర్త బ్యాక్ గ్రౌండ్..

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన కూతుర్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.. ఇక హేమ భర్త జాన్ ఎస్డీ లాల్ కుమారుడు.. ఇక తన కెరియర్ ఎదుగుదలకు సయ్యద్ సహకారం ఎంతో ఉందని ఈమె పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. మొత్తానికైతే సినిమా స్టోరీని తలపిస్తున్న ఈమె లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు