Family Star : ఎట్టకేలకు హౌస్ ఫుల్ బోర్డులు.. అయినా ఏం లాభం!

Family Star : టాలీవుడ్ లో ఈ వారం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ఎన్నో భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 5న రిలీజ్ కాగా, ప్రీమియర్స్ నుండే ఈ సినిమా అంతగా లేదని నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫలితంగా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవాల్సిన ఈ సినిమా, అనూహ్యంగా ఈ సినిమా విజయ్ కెరీర్ లో గత ఐదారేళ్లలో వచ్చిన సినిమాల కంటే లోయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక వీకెండ్ లో కనీస హోల్డ్ చూపించాల్సిన ఈ సినిమా దారుణమైన కలెక్షన్లను అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్(Family Star ) మూవీ నాలుగు రోజుల్లో కేవలం 12 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయగా, ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున ఎంతో కొంత గ్రోత్ ని చూపించింది.

ఉగాది అడ్వాంటేజ్ తో ఎంతో కొంత?

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్( Family Star) కి భారీగా సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో వీకెండ్ లో కూడా ఏమాత్రం హోల్డ్ చూపించలేక పోయిన సినిమా 5వ రోజున ఉగాది పండగ హాలీడే అడ్వాంటేజ్ లభించడంతో 4వ రోజు కన్నా కూడా డబుల్ గ్రోత్ ని 5వ రోజున చూపించింది. 4వ రోజున 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 5వ రోజున సినిమా 1.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 5 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ గా తెలుగు రాష్ట్రాల్లో 8.25 కోట్ల షేర్, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 1.05 కోట్ల షేర్, ఓవర్సీస్ లో గా 4.60 కోట్ల షేర్ రాబట్టగా, మొత్తమ్మీద వరల్డ్ వైడ్ గా 13.90 కోట్ల షేర్ 26.25 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఫ్యామిలీ స్టార్ బయ్యర్లకు రంజాన్ పై ఆశ?

ఇక ఫ్యామిలీ స్టార్ ఉగాది పండగ నాడు మంచి గ్రోత్ చూపించడంతో నష్టాలు తగ్గించుకోవడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు రంజాన్ రోజున గవర్నమెంట్ హాలిడే కావడంతో ఆరోజున కూడా ఫ్యామిలీ స్టార్ కి మంచి వసూళ్లు వస్తాయని బయ్యర్లు ఆశపడుతున్నారు. కానీ ఆ ఒక్క రోజు వల్ల ఎక్కడా పెద్దగా మార్పు ఉండదు. ఇక ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ సినిమా 5వ రోజు కొంచం గ్రోత్ ని చూపించి దుమ్ము లేపినా కూడా అందుకోవాల్సిన టార్గెట్ ఏకంగా 44 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా, క్లీన్ హిట్ కోసం ఇంకా 30.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అసాధ్యమే అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు నష్టాలను తగ్గించుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు