Tollywood:
సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక దాంతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక వీరి కుటుంబం నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గౌరవం అనే కంటెంట్ ఓరియంట్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు అల్లు శిరీష్. కే రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ సాధించలేకపోయింది.
ఆ తరువాత మారుతీ దర్శకత్వంలో కొత్తజంట అనే సినిమాలో నటించాడు శిరీష్. ఈ చిత్రం ఓ మోస్తారు విజయాన్ని నమోదు చేసింది. కానీ శిరీష్ కి మాత్రం ఆశించినంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత చేసిన శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. శిరీష్ ఇప్పటివరకు తన పెళ్లి గురించి కన్ఫర్మేషన్ చేయడం లేదు. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అంటున్నారు తప్పితే శిరీష్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ వార్త ఇప్పటివరకు బయటకి రాలేదు.
దీంతో శిరీష్ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓవైపు మెగా ఫ్యామిలీలో కూడా అందరు హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు. వరుణ్ తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ తరువాత సాయి ధరంతేజ్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ శిరీష్ కి ఇంకా ఎందుకు సంబంధాలు చూడట్లేదన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే శిరీష్ ఓ అమ్మాయిని ప్రేమించాడని, ఆ అమ్మాయిని అల్లూ ఫ్యామిలీ ఒప్పుకోలేదని, ఆ కారణంగానే శిరీష్ కోపంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News