Happy Birthday: ఓటమి ఎరుగని దర్శకధీరుడు..!

Happy Birthday:

ఓటమి ఎరుగని దర్శకధీరుడు..!

‘ఎస్.ఎస్.రాజమౌళి’… ఈ వ్యక్తి పదిహేనేళ్ల కిందట ఒక సాధారణ తెలుగు సినిమా దర్శకుడు. కానీ ఇప్పుడు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శక ధీరుడిగా, జక్కన్నగా సినిమాలను సంవత్సరాల తరబడి చెక్కే శిల్పిగా పేరున్న ఈ డైరెక్టర్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్బంగా ఆయన సినీ ప్రయాణంలో మచ్చుకు కొన్ని…

కర్ణాటక లో రాయ్చూర్ లో పుట్టిన ఈ దర్శక దిగ్గజం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కొడుకుగా మనందరికీ తెలుసు. అయితే ఆయన దర్శకుడిగా మారడానికి తాను పడ్డ కష్టం మామూలు కాదు. లెజెండరీ దర్శకుడు రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ గా చేసిన రాజమౌళి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకెదిగాడు.

- Advertisement -

శాంతి నివాసం అనే సీరియల్ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత రాఘవేంద్ర రావు ప్రోత్సాహంతో స్టూడెంట్ నెంబర్1 తో సినిమా డైరెక్టర్ అయ్యాడు. తొలి అడుగే విజయానికి నాంది గా, తెలుగు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా పునాది వేసుకున్నాడు.

అయినా కూడా ఆ తర్వాత వెంటనే అవకాశాలు రాలేదు. ఆయన డైరెక్ట్ చేసిన సింహాద్రితో ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడో అందరికి తెలిసిందే. కానీ రాజమౌళి ముందుగా నందమూరి బాలకృష్ణకి, ఆ తర్వాత ప్రభాస్ కి కథ చెప్పగా, అనివార్య కారణాలతో వాళ్ళు సినిమా చేయలేకపోయారు. చివరగా ఎన్టీఆర్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ… ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీ ని షేక్ చేసాడు.

ఆ తర్వాత రాజమౌళి కెరీర్ ఇండస్ట్రీ లో రెండు మలుపులు తీసుకుంది. మొదటిది రాజమౌళి దర్శకత్వం వహించిన “మగధీర” సినిమాతో.. ఒక్క సినిమా మాత్రమే అనుభవం ఉన్న రామ్ చరణ్ తో అప్పటికే తెలుగులో అత్యధిక బడ్జెట్ తో తీసిన ఈ సినిమా సౌత్ ఇండియా లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా రికార్డు సృష్టించింది. అప్పటివరకు తెలుగుకి మాత్రమే పరిమితమైన రాజమౌళి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఈ సినిమాతోనే రాజమౌళి దర్శక ధీరుడిగా మారారు.

ఇక రెండో మలుపు.. బాహుబలి.. ఈ కళాఖండం ఏ ముహూర్తాన తీద్దామని ఫిక్స్ అయ్యాడో గాని.. యావత్ భారతదేశం మొత్తం తెలుగు ఇండస్ట్రీకి దాసోహం అయింది. తెలుగు సినిమాకి అనడం కన్నా ఒక రాజమౌళికి దాసోహం అయింది అనడం బెటర్. బాహుబలి తో జక్కన్న సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. బాహుబలి తర్వాతే పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అవడం స్టార్ట్ అయ్యాయి.

ఇక లేటెస్ట్ గా RRR గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా జేమ్స్ క్యామెరూనే రాజమౌళిని దర్శకత్వ ప్రతిభని మెచ్చారంటే జక్కన్న క్రియేటివిటీ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఎవరి సపోర్ట్ లేకపోయినా ఆస్కార్ వరకు వెళ్లి తన సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చాడు.

మాములుగా ఇండస్ట్రీ లో జనాల నాడీ తెలియాలి అంటారు.
నిజంగా ఆ కాన్సెప్ట్ ఉంటే, దానిలో రాజమౌళి మాస్టర్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ తెలుగు సినిమాను శిఖరం మీద కూర్చోబెట్టాడు ఈ దర్శకదీరుడు.
ఊహ వేరు ఊహను వెండితెరపై ఆవిష్కరించడం వేరు,
ఊహలు అందరికి వస్తాయి, కొందరు దానిని కాగితం వరకే పరిమితం చేస్తారు, కానీ రాజమౌళి కొంచెం ముందడుగు వేసి ఆ ఊహను ఆడియన్స్ కళ్ళ ముందు పెట్టాడు. వరుస హిట్ లు కొట్టాడు ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తల తిప్పుకునేలా చేసాడు.

ఓ సినిమాలో చెప్పినట్లు..
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేదు..
జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.
ఈ డైలాగ్ కి రాజమౌళికి మించి ఎవ్వరూ న్యాయం చేయలేరు అనిపిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు