టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో రజాకార్ ఒకటి. నిజానికి ఈ సినిమా చిన్న సినిమా కాకపోయినా సినిమా నిర్మాణ విలువలు చూస్తే అలాగే అనిపిస్తుంది. అయితే కథ నేపథ్యం చూసుకుంటే పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్టు ఇది. ఇకపోతే తెలంగాణ నిజాం రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా రజాకార్. మార్చి 15న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సినిమాకి సరైన ప్రమోషన్లు లేకపోవడం వల్ల అంతగా థియేటర్లలో ఆదరణ రావడం లేదు. కానీ మౌత్ టాక్ తో రజాకార్ జనాల్ని బాగానే థియేటర్లకు రప్పిస్తుందని చెప్పొచ్చు. ఇక రెండో రోజు నుండి రజాకార్ సినిమా థియేటర్లో బాగానే ఆడేస్తోంది. సినిమా చూసిన వారంతా కూడా బరువెక్కిన గుండెతో బయటకు వస్తున్నారు. ఇంతటి దారుణాలు జరిగాయా? ఇంతటి హత్యాకాండలు జరిగాయా? అని తెలంగాణ ప్రేక్షకులు తమ చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతోన్నారు. ఆ మారణకాండను చూసి ఇప్పుడు చలించిపోతోన్నారు. అప్పటి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అని తలుచుకుంటున్నారు. ఇలా రజాకార్ సినిమా మీద పాజిటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి.
సినిమా సెలెబ్రిటీస్ నో రెస్పాన్స్..
అయితే రజాకార్ సినిమా కి మంచి స్పందన వస్తున్నా సినిమా సెలబ్రిటీ ల నుండి మాత్రం పెద్దగా రియాక్షన్ రావడం లేదు. మరి ఒక వర్గం ఆడియన్స్ నుండి విమర్శలు వస్తాయని భయపడుతున్నారా? లేక మరేదైనా కారణమో తెలీదు గాని ఇండస్ట్రీ తరుపు నుంచి పెద్దలెవ్వరూ కూడా ఈ సినిమాను చూసినట్టుగా కనిపించడం లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అయిందని కూడా చాలా మందికి తెలియనట్టుంది. ఏ ఒక్కరూ కూడా రజాకార్ మూవీ మీద ఇప్పటివరకూ స్పందించలేదు. కానీ యాంకర్ సుమ మాత్రం ఈ చిత్రాన్ని చూసినట్టుగా చెప్పుకొచ్చింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని, రివ్యూని చెప్పేసింది. పైగా సుమ వేసిన ట్వీట్‌కు రజాకార్ హీరోయిన్ వేదిక కూడా రిప్లై ఇచ్చింది. ఇక రజాకార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే.
రజాకార్ పై సుమ రియాక్షన్..
అయితే రజాకార్ సినిమా చూసి స్పందించిన సుమ కనకాల ట్విట్టర్ వేదిక గా తన అభిప్రాయాన్ని పంచుకుంది. సుమ ట్విట్టర్ లో స్పందిస్తూ, రజాకార్ మూవీ చూశాను.. ఆ ఘటనలు చూసి నా గుండె ముక్కలైంది. హైదరాబాద్ సంస్థాన ప్రజల స్వతంత్ర పోరాటాన్ని చక్కగా చూపించారు. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్. అలాగే అనసూయ, ప్రేమ, ఇంద్రజ, బాబీ సింహా, వేదిక ఇలా అందరూ అద్భుతంగా నటించారు అని సుమ ట్వీట్ వేసింది. ఇక ఈ ట్వీట్ కు రజాకార్ హీరోయిన్ వేదిక స్పందిస్తూ థాంక్యూ సుమ అని రిప్లై ఇచ్చింది. ఇకపోతే రజాకార్ మూవీకి భారీగా ఖర్చు పెట్టారని తెలిసిందే. చాలా సార్లు వాయిదా పడుతూ రావడం వల్ల బడ్జెట్ లిమిట్ దాటింది. అయితే సినిమా క్వాలిటీ పరంగా బాగానే ఉన్నా, గ్రాఫిక్స్ పైన ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. అయితే క్లైమాక్స్ రజాకార్ సినిమా ని నిలబెట్టిందని చెప్పొచ్చు. ఆదివారం వీకెండ్ కావడంతో మౌత్ టాక్ ఎఫెక్ట్ తో ప్రేక్షకులు మరింతగా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపీ బండి సంజయ్ కూడా రజాకార్ సినిమాని చూడడం జరిగింది.
Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.