Samantha and VD’s Kushi: విజయ్ దేవరకొండను మోసం చేసిన సమంత..!

Samantha and VD’s Kushi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ – టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ. బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు ఈ సినిమా రెడీ అవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ పతాకంపై నవీన్ యుర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మూవీ ప్రమోషన్స్ చేపడుతుంది యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా రాజీవ్ కనకాలతో కలిసి సుమ ఈ సినిమా టీమ్ ని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సమంత, విజయ్ దేవరకొండ తో పాటు దర్శకుడు శివ నిర్వాన, కమెడియన్ వెన్నెల కిషోర్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సమంతకి సంబంధించిన పలు కీలక విషయాలను బయటపెట్టారు విజయ్ దేవరకొండ. సమంతను అస్సలు నమ్మకూడదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆమె మోసం చేస్తుందని ఓపెన్ గా చెప్పేశారు. అసలు విషయం ఏంటంటే.. సమంత బోర్డ్ గేమ్స్ లో చాలా చీటింగ్ చేస్తూ ఆడుతుందట. కానీ ఆమె చీటింగ్ చేసే విషయాన్ని ఎదుటి వాళ్ళు ఒప్పుకునేలాగా కూడా ఉండదన్నారు. ఇప్పటివరకు తానే పెద్ద ఇంటిలిజెంట్ అనుకునేవాడినని.. కానీ చీటింగ్ చేయడంలో సమంత తనకంటే పెద్ద ఇంటిలిజెంట్ అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. దీంతో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు