Gang of Godavari Song : అడవికి గొడ్డలి.. కడుపుకి అంబలి.. కత్తికి కోబలి.. మట్టికి నాగలి.. గ్యాంగ్ ఆఫ్ గోదావరి థీమ్ సాంగ్ లిరికల్ వీడియో..!

Gang of Godavari: గామి హిట్ తో విశ్వక్సేన్ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. వరస సినిమాలను లైన్లో పెడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 17వ తారీఖున రిలీజ్ కానుంది.

gang-of-godavari-theme-song-lyrical-video
gang-of-godavari-theme-song-lyrical-video

ఈ మేరకు రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది అనే సమయంలో మేకర్స్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ మే 31కి వాయిదా వేశారు. దీంతో విశ్వక్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే నేడు అనగా మే 10 వ తారీఖున గ్యాంగ్ ఆఫ్ గోదావరి టీం సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.

లిరికల్ సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ వారు యూట్యూబ్లో రిలీజ్ చేశారు..” అడవికి గొడ్డలి.. కడుపుకి అంబలి.. కత్తికి కోబలి.. మట్టికి నాగలి.. ” అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియోని చూసిన పలువురు.. మరోసారి పక్కా హిట్ కొట్టడం కార్యం. ఈ వీడియోని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం విశ్వక్సేన్ టైం నడుస్తుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు