Vaishnav Tej : లవ్ అండ్ రొమాంటిక్ గా ”సిరి సిరి మువ్వల్లోన”

సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా “ఉప్పెన” సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన తర్వాత చిత్రం “కొండ పొలం” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “రంగ రంగ వైభవంగా”. తమిళ “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ గిరీశయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై, బాపినీడు బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తిరకెక్కుతోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్, పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి “సిరి సిరి మువ్వల్లోన” అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. గ్రామీణ ప్రాంతంలో హీరో, హీరోయిన్ మధ్య సాగే ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో కేతిక శర్మ ఓ డాక్టర్ గా నటించబోతున్నట్లు సాంగ్ లో తెలుస్తుంది. శ్రేయ ఘోషల్, జావిద్ అలీ ఈ పాటని అద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు