Bigg Boss Season7: పల్లవి ప్రశాంత్ భజన చేసిన నాగార్జున – ఫేక్ బిహేవియర్ కనిపించలేదా..?

Bigg Boss Season7

మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవలే స్టార్ట్ అయ్యి ఇంట్రస్టింగ్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ అందరు యాక్టివ్ గా ఉండటంతో ఫస్ట్ వీక్ నుండే హౌస్ లో హీట్ పెరిగింది. ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ కూడా ఇంట్రస్టింగ్ గా సాగింది. ఫస్ట్ వీక్ హౌస్ లో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ కి వాళ్ళు ఇచ్చుకున్న రేటింగ్ కి ఆడియెన్స్ ఇచ్చిన రేటింగ్ ని కంపేర్ చేశాడు నాగార్జున.అందరు కంటెస్టెంట్స్ విషయం ఎలా ఉన్నా కానీ రైతు బిడ్డనని చెప్పుకొని సింపతితో హౌస్ లోకి ఎంటరైన పల్లవి ప్రశాంత్ విషయంలో మాత్రం నాగార్జున కొంచెం బయాస్డ్ గా ఉన్నట్లు అనిపించింది.
పాజిటివిటీతో ఎంటరైన ప్రశాంత్ కి అధిక శాతం ఓట్స్ రావటంతో ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు. అయితే, సింపతితో హౌస్ లోకి ఎంటరైన ప్రశాంత్ లోపలికి వెళ్ళాక పూర్తి అపోజిట్ గా బిహేవ్ చేస్తున్నాడు. రతిక తో పులిహోర కలపటం, కెమెరాల కోసం ఫేక్ ఎమోషన్ చూపించటం, కింద పడ్డ మెతుకులు ఏరుకొని మరీ తినటం వంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు.
ప్రశాంత్ బిహేవియర్ పట్ల సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో నాగార్జున ప్రశాంత్ ని అప్రిషియేట్ చేయటం చుస్తే ప్రశాంత్ పట్ల బిగ్ బాస్ టీమ్ బయాస్డ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రతి సీజన్లో ఇలా నెగిటివిటీ ఉన్న కంటెస్టెంట్స్ ని చివరి వరకు హౌస్ లో ఉండేలా చేయటం కామనే అయినప్పటికీ ప్రశాంత్ కి బిగ్ బాస్ సపోర్ట్ చేయటం మాత్రం ఆడియెన్స్ సహించలేకపోతున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు