Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. బిగ్ బాస్ పరువు మొత్తం పోయే..!

బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా బాలీవుడ్ లో మొదలై ఇప్పుడు అన్ని భాషలలో కూడా విజయవంతంగా కొనసాగుతున్న ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ షో కి మరింత పాపులారిటీ లభించింది. మొదటిసారి బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్టుగా ఎన్టీఆర్ వ్యవహరించి షోని ప్రేక్షకులలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించగా.. ఇక మూడవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. తాజాగా సీజన్ 7 లో భాగంగా ఉల్టా ఫుల్టా అని మొదలైయి.. షో పై ఆసక్తి కలిగించారు..

మొదటినుంచి కూడా ఈ సీజన్లో ఎన్నో కొత్త విషయాలు జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే హౌస్ లోకి రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ క్యాటగిరిలో అడుగుపెట్టి విన్నర్ గా తిరిగి రావడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ఇక బయటికి వస్తే అతనిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది రైతుబిడ్డలు బాగుపడతారు అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ రైతు బిడ్డ నిజస్వరూపం బయటపడింది.

హౌస్ లో ఉన్నంతసేపు రైతుబిడ్డ అనే ట్యాగ్ తగిలించుకొని సింపతి ప్లే చేసిన ఇతడు.. బయటికి రాగానే తన అసలు బుద్ధి బయటకు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు… అమర్ దీప్ కారుపై దాడి.. పోలీసులతో గొడవ.. స్టూడియో బయట జరిగిన ఘర్షణలో కంటెస్టెంట్స్ పై కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ విషయమై పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ .. అవేమి తనకు తెలియదని కూడా చెప్పుకొచ్చాడు. కానీ పోలీసులు కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ ను అరెస్టు చేశారు. వాస్తవానికి పల్లవి ప్రశాంత్ ప్రవర్తన బయట ప్రేక్షకులను అలాగే సెలబ్రిటీలను కూడా భారీ స్థాయిలో ఇబ్బంది పెట్టిందని చెప్పాలి.

- Advertisement -

ఇక బిగ్ బాస్ ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకోగా.. ఏ సీజన్లో కూడా ఇలాంటి రచ్చ జరగలేదు.. రెండవ సీజన్లో కౌశల్ పేరు మీద ఆర్మీ ఏర్పాటు చేసినా.. ఇంత రచ్చ కాలేదు. ఇక చాలామంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి తమ కెరియర్ను చూసుకున్నారు. కానీ ఇలా పోలీస్ కేసు వరకు వెళ్లలేదు. ఇలాంటి రచ్చ చేసి బిగ్ బాస్ పరువు మొత్తం తీసేసాడు పల్లవి ప్రశాంత్.. దీంతో కొంతమంది అతడు రైతుబిడ్డ అనే పదాన్ని వాడుకుంటున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇది ఎంతవరకు వెళుతుంది? అతడికి శిక్ష పడుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది .

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు