The Family Man :ఇంకెంత కాలం ?

బాలీవుడ్ హీరో మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫాంలో వచ్చిన వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మెన్”. 2019లో మొదటి సీజన్ వచ్చి, సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులను తన వైపు తిప్పుకుంది. రెండో సీజన్ 2021లో ప్రైమ్ వీడియోలో వచ్చింది. పాత పాత్రలను ఉపయోగించి, స్టోరీని కొంత వరకు మార్చి తెరకెక్కించారు దర్శకత్వ ద్వయం రాజ్ అండ్ డీకే. ఈ రెండో సీజన్ లో సమంత నటన వేరే లెవెల్ లో ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఈ సిరీస్ లవర్స్ మూడో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు మూడో సీజన్ కు సంబంధించిన ఒక అప్ డేట్ కూడా రాలేదు. ఇంకేంత కాలం వెయిట్ చేయాలి అంటూ మేకర్స్ ను సినీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే సీజన్ లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత తో పాటు పాత పాత్రలు ఉంటాయని మేకర్స్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

ఈ మధ్య కాలంలో సమంత యాక్టింగ్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. స్టోరీ నచ్చితే, ఎలాంటి పాత్రలకు అయినా, సై అంటుంది. అలా రెండో సీజన్ లో సమంత చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మూడో సీజన్ లో సమంత ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో అనే ఉత్కంఠ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు