Chiranjeevi : విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా, ప్రస్తుతం ఒక సినిమా పేరు మార్మోగిపోతుంది. అదే లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన “విక్రమ్”. ఈ సినిమా ఈ నెల 3న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన విషయం తెలిసిందే. మొదటి షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకెళ్తుంది విక్రమ్. దీంతో కమల్ హాసన్ ను పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

అలాగే విక్రమ్ సినిమా టీం కూడా ఈ విజయాన్నిసెలబ్రేట్ చేసుకుంటుంది. మూవీ మేకర్స్ వరుసగా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విక్రమ్ బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ తర్వాత విక్రమ్ టీం కు మెగా స్టార్ చిరంజీవి తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హీరో నితిన్ కూడా హాజరయ్యారు.

పార్టీ అనంతరం కమల్ హాసన్‌, డైరెక్టర్ లోకేష్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిరంజీవి పంచుకున్నారు. అంతే కాకుండా, “నా పాత మిత్రుడిని కలిసినందుకు సంతోషంగా ఉంది. విక్రమ్ సినిమా సూపర్ హిట్ సాధించినందుకు, మూవీ టీంతో కలిసి రాత్రి మా ఇంట్లో పార్టీ చేశాం. కమల్‌హాసన్‌, సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్‌ మా ఇంటికి రావడంతో సంతోషంగా ఉంది. విక్రమ్ సినిమా థ్రిల్లింగ్ గా, అద్భుతంగా ఉంది. విక్రమ్ విజయం మరింత శక్తిని ఇస్తుంది” అంటూ కమల్ హాసన్ ను ఉద్ధేశించి ఓ ట్వీట్ కూడా చేశాడు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు