MaheshBabu: రాజమౌళికి రెండేళ్లు సరిపోతాయా.?

ఎస్.ఎస్.రాజమౌళి శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు తన సినిమాని చెక్కుతూ ఉంటారు అందుకే ఈయనను జక్కన్న అంటారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా దగ్గర మొదలైన రాజమౌళి ప్రయాణం తెలుగు సినిమాని శిఖరాగ్రానికి చేర్చేవరకు వరకు ఎదిగింది. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఏమి ఇవ్వాలి అని క్షుణ్ణంగా తెలిసిన దర్శకుడు రాజమౌళి.
అందుకే ఇప్పటివరకు ఓటమి ను తన చెంత చేరనివ్వలేదు.

ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన రాజమౌళి ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎట్టకేలకు ఆ కల నిజమైంది.
రాజమౌళి మహేష్ బాబుతో సినిమాని చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. లక్డౌన్ లో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ కొన్ని రోజుల్లో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న మహేష్,
ఆ తరువాత రాజమౌళి ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నారు.

రాజమౌళి సినిమా అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనేవిషయం మనకు తెలిసిందే, సినిమా రావడం లెట్ అయిన ఆ సినిమా ప్రభావం మాత్రం బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు రెండు సంవత్సరాలు కేటాయించనున్నట్లు తెలుస్తుంది, అలానే రాజమౌళి తీసుకునే జాగ్రత్తలకి , ఆ సినిమా క్వాలిటీ రాజమౌళికి రెండేళ్లు సరిపోతాయా అని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.జక్కన సినిమా మొదలయ్యే లోపు త్రివిక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతే మహేష్ అభిమానులకి కొంత ఉపశమనం కలిగినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు