Vikram : పూర్వ వైభవం !

కమల్ హాసన్, కోలీవుడ్ హీరో అయినా, విశ్వనటుడు అని పిలుస్తారు. ఒక ప్రాంతీయ సినిమా హీరోను విశ్వనటుడు అంటున్నారంటే, కమల్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమల్ హాసన్ కెరీర్ లో “సాగరసంగమం” “మరో చరిత్ర” “ఆకలి రాజ్యం” “స్వాతి ముత్యం” “ఇంద్రుడు చంద్రుడు” “భారతీయుడు” “దశావతారం” ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మర్చిపోలేని సినిమాలు ఉన్నాయి.

అయితే, గత కొద్ది రోజుల నుండి కమల్ హాసన్ కు సాలిడ్ హిట్ రావడం లేదు. కొంత గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేసినా, ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అయినా, కమల్ పై ఎక్కడా అభిమానం తగ్గలేదు. అలాంటి సమయంలో కమల్ కు వచ్చింది “విక్రమ్”. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 3న పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి షో నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది విక్రమ్. దీంతో సినిమాపై కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 285 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక తమిళనాడులో తొలి వారంలోనే ఈ సినిమా 100 కోట్ల మార్కును అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో 125 కోట్లు వసూళ్లు చేసిందని సమాచారం. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా “విక్రమ్” నిలిచింది.

- Advertisement -

ఈ సినిమా ఇలాగే రన్ అయితే, మరిన్నీ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు