Sarkaru Vaari Paata : నష్టాల్లో “సర్కారు వారి” టీం..?

మహేష్ బాబు- పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తున్నా, చడి చప్పుడు కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. పే పర్ వ్యూ రెంటల్ పద్ధతిలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చారు మేకర్స్. రూ.199 చెల్లిస్తే చాలు ఇంటిల్లిపాది కలిసి సినిమాని చూసేయొచ్చని చిత్ర బృందం ప్రకటించింది. 
సర్కారు వారి పాట నిర్మాతలు ఇలా చేయడం వల్ల మహేష్ బాబు అభిమానులు, థియేటర్ యాజమాన్యాలు మండిపడుతున్నారు. అయితే ‘సర్కారు వారి పాట’ మేకర్స్ ఇలా చేయడం వెనుక ఓ కారణం కూడా ఉందని తెలుస్తుంది. ఈ చిత్రానికి ఫుల్ రన్ లో రూ.7 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందట. అందుకే ముందు జాగ్రత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో మేకర్స్ ఓ ఒప్పందం చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం.. సినిమాని 3 వారాలు పూర్తయ్యాక పే పర్ వ్యూ రెంటల్ పద్ధతిలో ఓటీటీకి ఇవ్వాలి. ఇందుకు రూ.10 కోట్లు అదనంగా మేకర్స్ తీసుకున్నారట. అయితే ఈ సినిమాకు నైజంలో మంచి కలెక్షన్లు వచ్చినా, ఆంధ్రలో స్వల్పంగా నష్టాలు నమోదు అయ్యాయని సమాచారం.
ఆ నష్టాలను భర్తీ చేయడానికి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. రెంటల్ పద్ధతిలో కూడా ఈ మూవీ ఎంతో కొంత కలెక్ట్ చేస్తుంది అనేది నిర్మాతల నమ్మకం. కాకపోతే రెంటల్ పద్ధతిలో ఓటీటీకి ఈ సినిమా వచ్చినా, పైరసి సంస్థలు డౌన్లోడ్ చేసి పలు వెబ్ సైట్స్ లో పెట్టేశాయి. దాంతో  మొబైల్ లో, టోరెంట్స్ వంటి వాటిలో డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్న జనాలు కూడా ఉన్నారు. ఈ స్ట్రాటజీ వల్ల అమెజాన్ వారికి నష్టమే, థియేటర్ యాజమాన్యాలకు నష్టమే అని చెప్పొచ్చు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు