సినిమా వేడుకల్లో కొందరు స్టేజి పై ఉన్నప్పుడు ఆత్రం ఆపుకోలేక కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసేస్తూ ఉంటారు. చిరంజీవి అయితే సినిమా వేడుకల్లో ఏదో ఒక విషయాన్ని లీక్ చేసే వరకు మైక్ వదలరు. ఈ విషయంలో పలు సార్లు ఆయన పై ఆయనే సెటైర్లు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో చిరుని ‘లీక్ స్టార్’ అంటుంటారు. ఇప్పుడు ఆయన బావమరిది అల్లు అరవింద్ కూడా అలాగే ఓ విషయాన్ని లీక్ చేసేసారు. అది కూడా తన కొడుకు.. స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి కావడం విశేషం.
విషయం ఏంటంటే.. ఈ మధ్యనే విదేశాల నుంచి అల్లు అర్జున్ తిరిగి ఇండియాకు వచ్చారట. వచ్చిన తర్వాత ‘ఎఫ్3’ సినిమా బాగుంది క్యూబ్ లో వేయించుకుని చూడు అని అల్లు అరవింద్ చెప్పారట. క్యూబ్ లో కాకుండా, చూస్తానులే అని అల్లు అర్జున్ అన్నాడట. అయితే బన్నీ ఎప్పుడు సినిమా చూడాలి అనుకున్నా, కూకట్ పల్లి లో ఉన్న ఓ థియేటర్ వద్దకు వెళ్లి ముసుగు వేసుకుని సినిమా చూసి వచ్చేస్తాడట. సినిమా స్టార్ట్ కావడానికి కొన్ని నిమిషాల ముందు వెళ్లడం, మళ్ళీ ఇంటర్వెల్ కు డోర్ దగ్గరకు ఉండటం, మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యాక వెళ్లి మొత్తం చూడటం, ముసుగు వేసుకోవడం లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటాడని అల్లు అరవింద్ తెలిపాడు. జనాలతో కలిసి సినిమా చూడటం అంటే బన్నీకి ఇష్టమని అల్లు అరవింద్ పబ్లిక్ గానే చేప్పారు.