Prabhas : ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఇంకా ఎందుకు రాలేదు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తర్వాత ఫిట్నెస్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అతి కష్టం మీద సన్నబడినా మళ్ళీ కొద్దిరోజులకే షెపౌట్ అయిపోతున్నాడు. ‘రాధే శ్యామ్’ లో ప్రభాస్ ను సన్నగా చూపించడానికే ఎక్కువగా వి.ఎఫ్.ఎక్స్ వాడారని వినికిడి. ఇప్పుడు ‘ఆది పురుష్’ సినిమా కోసం మరింత ఎక్కువగా వి.ఎఫ్.ఎక్స్ ను వాడుతున్నారని సమాచారం. ‘ఆదిపురుష్’ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ జరుగుతుంది. 70 శాతం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ తో కూడుకున్న మూవీ ఇది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

రాముడి పాత్రలో కనిపించాలి అంటే ప్రభాస్ కు మీసాలు ఉండకూడదు, సన్నగా ఉండాలి. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఒత్తైన మీసాలతో, అధిక బరువుతో కనిపించాడు. ప్రభాస్ ఎలా ఎందుకు ఉన్నాడని చాలా మందికి అది అర్థం కాలేదు. కానీ దాని వెనుక రహస్యం ఇదే అని ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వినిపస్తుంది. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఇప్పటి వరకు వదల్లేదని తెలుస్తుంది. కాగా, ‘ఆదిపురుష్’ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా ఇదే. సీత పాత్రలో కృతి సనన్, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు