ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబం నుంచి ధనిక కుటుంబం వరకు అందరికి అందుబాటులో ఉండేది సినిమా.పుట్టిన రోజుకో , పండగకో , పెళ్లిరోజుకో సందర్భం ఏదైనా సినిమాకు వెళ్లడం మాత్రం ఖాయం.
ఈ మధ్యకాలంలో సినిమా ఒక మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉండట్లేదు అన్నది వాస్తవం. ఒక ఫ్యామిలీ తో పాటు సినిమాకి వెళ్తే ఈజీగా 2000 ఎగిరిపోతున్నాయి. అందుకే ఆడియన్స్ చాలావరకు సినిమాలకు రావడం తగ్గించారు. ఒకప్పుడు కిల్ పైరసి అని చెప్పే సినిమా ప్రముఖులు ఈ మధ్యకాలంలో ఆ మాటను అనడం కూడా మానేశారు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఓటిటి లా హావా నడుస్తుంది.
ఏదిఏమైనా వాళ్ళకి కూడా ఏదో మూల ఇప్పుడు టికెట్ రేట్స్ భారీగా ఉన్నాయ్ అనిపించి ఉంటుంది.
రీసెంట్ టైమ్స్ లో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా తమ సినిమా “F3” రిలీజ్ టైం లో టికెట్ రేట్స్ మేము పెంచట్లేదు అని నొక్కి వక్కాణించి చెప్పారు. ఈ టికెట్ రేట్లు వలన చాలామంది ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గించారు అనే విషయాన్ని గమనించిన దిల్ రాజు తనే కొంచెం దిగి వచ్చారు. రీసెంట్ గా రిలీజ్ అయినా మేజర్ మూవీ టీం కూడా సినిమా టికెట్ రేట్లను ఉన్న ధరలకంటే ఇంకా తక్కువ రేటుకు అందించారు.
ఇప్పుడు “పక్కా కమర్షియల్” మూవీ టీం కూడా సినిమా అందరికి అందుబాటులో ఉండేలా పర్ఫెక్ట్ ప్లాన్ వేసింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రేట్ల తగ్గింపు విషయంలో మరి కాస్తా ముందడగు వేశారు. తన నిర్మాణంలో వస్తున్న “పక్కా కమర్షియల్” సినిమాలకు టికెట్ల ధరలు ఇంకా తగ్గించారు. నిర్మాత బన్నీ వాసు పక్కా కమర్షియల్” ప్రెస్ మీట్ సందర్భంగా తమ సినిమా టికెట్ల రేట్ల గురించి స్పష్టమైన ప్రకటన చేశాడు.
తెలంగాణలో జీఎస్టీతో కలిపితే మల్టీప్లెక్సుల్లో రూ.189, సింగిల్ స్క్రీన్లలో రూ.112 రేటు ఉండబోతోంది ఈ సినిమాకు. ఏపీలో ఈ రేట్లు వరుసగా రూ.177, రూ.112 ఉండబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ల ధరను రూ.112 పెట్టడం కచ్చితంగా సినిమాకు కలిసొచ్చేదే. ఈ రేటుతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. సినిమా ఏ మాత్రం వర్కౌట్ అయినా తెలుగు సినిమాకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్లే.