F3 : ‘ఎఫ్3’ పరిస్థితేంటి?

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం గత వారం రిలీజ్ అయ్యి, హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి వారం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రూ.64 కోట్లకి విక్రయించారు కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ టార్గెట్ అందుకోవడం అంత ఈజీ అనిపించడం లేదు.

జూన్ 3 ని టార్గెట్ చేసి ‘మేజర్’ ‘విక్రమ్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. పైగా ఈ చిత్రాలకి టికెట్ రేట్లు కూడా బాగా తక్కువగా ఉన్నాయి. కాబట్టి, ఈ వారం థియేటర్ కు వెళ్లే ప్రేక్షకులకి ఈ సినిమాలు ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమాలే అయిపోయాయి. దాంతో ‘ఎఫ్3’ డిమాండ్ ఒక వారానికే తగ్గిపోయింది. ఈ వీకెండ్ వచ్చినా, ఎఫ్ 3 సినిమా బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. అలా అని హిట్ టాక్ సంపాదించుకున్న ఎంటర్టైన్మెంట్ సినిమాలకి హౌస్ ఫుల్స్ పడకుండా ఉండవు. పైగా ఇది నిర్మాత దిల్ రాజు సినిమా కాబట్టి, ఈ వీకెండ్ కూడా ఎక్కువ థియేటర్లనే హోల్డ్ చేసింది. దీంతో ఈ వీకెండ్ ను ఎంత వరకు క్యాష్ చేసుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు