Major : కశ్మీర్ ఫైల్స్ ను మేజర్ బ్రేక్ చేస్తుందా..?

కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో రూపొందిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రూ.250 కోట్ల వరకు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఈ సినిమా కేవలం ఒక హిందీలోనే మాత్రమే విడుదల అయిన ఈ సినిమా ఎవరూ ఊహించనంత హిట్ అందుకుంది. కానీ దేశమంతా ఈ చిత్రాన్ని చూసి ‘భారత్ మాతా కి జై’ అంటూ కన్నీళ్లు విడిచి థియేటర్ల నుండి బయటకి వచ్చారు. పాన్ ఇండియా సినిమాల వల్ల సాధ్యంకాని కలెక్షన్స్ ను ఈ చిత్రం రాబట్టింది. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది.

అలాగే జూన్ 3న విడుదలైన మేజర్ సినిమా  కూడా దేశ భక్తితో కూడిన సినిమానే. అయితే ఇది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది.  ‘మేజర్’ ను చూసిన ప్రేక్షకులు కూడా థియేటర్ నుండి బయటకి వచ్చి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనా, ఎక్కువ థియేటర్లలో మాత్రం లేదు. మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న మేజర్, ‘ది కశ్మీర్ ఫైల్స్’ రికార్డులను బ్రేక్ చేస్తుందా.. అనే ప్రశ్న వస్తుంది. అయితే కశ్మీర్ ఫైల్స్ సినిమా రికార్డులను బ్రేక్ చేయడమే కాదు, కొత్త రికార్డులను మేజర్ తన పేరిట వేసుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు