సీనియర్ నటి ప్రగతి.. హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ… ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించలేకపోయింది. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది. టాలీవుడ్లో సహాయ నటిగా 100 కి పైగా సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన బ్రేక్ అంత త్వరగా రాలేదు. ‘దూకుడు’ ‘బాద్ షా’ వంటి చిత్రాలు ఈమెలోని కామెడీ యాంగిల్ ను బయటపెట్టాయి. దానిని దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాలో బాగా వాడుకున్నాడు. దాంతో ప్రగతి క్రేజ్ పెరిగింది. ఇక లాక్ డౌన్ టైంలో అయితే సోషల్ మీడియాలో ఈమె చేసిన సందడి అంతా ఇంత కాదు. డ్యాన్స్ వీడియోలు, యోగా వీడియోలు చేస్తూ ఈమె కుర్రకారుని సైతం ఆకర్షించింది.
దీంతో సోషల్ మీడియాలో ఈమె పెద్ద స్టార్ గా అవతరించింది. అందుకే ఈమె క్రేజ్ ను ‘ఎఫ్3’ ప్రమోషన్లకు కూడా బాగా ఉపయోగించుకుని స్పెషల్ మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ‘ఎఫ్3’ కూడా సూపర్ హిట్ అవ్వడం.. ప్రగతి పాత్రకి మరింత మంచి పేరు రావడంతో తర్వాత సినిమాలకు పారితోషికాన్ని కూడా ఈమె భారీగా పెంచేసిందట. ఇప్పుడు తన వద్దకు వచ్చే దర్శకనిర్మాతలకు ఒక్కో కాల్షీట్ కు రూ.50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. అంటే ఈమె 10 రోజులు కాల్షీట్లు ఇస్తే రూ.5 లక్షలు చెల్లించాలన్న మాట. తన సినిమాలు హిట్ కావడంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రగతి స్టైల్ నే మార్చిసింది.