OTT Movie : మైండ్ తోనే అన్నీ కంట్రోల్ చేసే కూతురిని చంపాలని తల్లిదండ్రుల ప్లాన్… నెక్స్ట్ మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్

OTT Movie : ఓటిటిలో ఎన్నో జానర్లలో సినిమాలు అందుబాటులో ఉండగా, అందులో సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ మూవీస్ ప్రత్యేకమని చెప్పాలి. ఇలాంటి సినిమాలు చూడడం ఎగ్జైటింగ్ గా, థ్రిల్లింగ్ గా అన్పిస్తుంది. అలాంటి జానర్ మూవీ లవర్స్ కోసం ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ సజెషన్ ను మీ ముందుకు తీసుకొచ్చాము. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? టైటిల్ ఏంటో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు థెల్మా. దర్శకుడు జోయాచిమ్ ట్రయర్ మూవీలో సస్పెన్స్ ను చివరి వరకు మైంటైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. సినిమాలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా సస్పెన్స్ మాత్రమే పర్ఫెక్ట్ గా రూపొందించాడు. అయితే ఇదొక నార్వేజియన్ భాషకు చెందిన మూవీ. ఓటిటిలో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నార్వే నుంచి అకాడమీ అవార్డులో అడుగు పెట్టిన ఈ మూవీని అస్సలు మిస్ కావొద్దు. థెల్మా మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Thelma (2017) | Keys art, Film art, Movie posters

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

మూవీ స్టార్టింగ్ లోనే అడవిలో జింకను చూసి ఎంజాయ్ చేస్తున్న కూతురు తలకు తండ్రి గన్ ను గురి పెడతాడు. 20 ఏళ్ల తర్వాత థెల్మా హాస్టల్ లో ఉంటూ కాలేజీలో చదువుకుంటుంది. ఆమె ఒక రోజు ఫిట్స్ వచ్చి పడిపోతుంది. కానీ ఒక్కరు కూడా ఆమె దగ్గరకు రారు. అయితే కాలేజ్ వాళ్ళే థెల్మాను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అయితే తన ఫ్యామిలీకి ఈ విషయాన్ని చెప్పొద్దని చెప్తుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత రోజు థెల్మా ఎలా ఉందో కనుక్కుందామని ఆమె క్లాస్మేట్ వస్తుంది. తనతో మాట్లాడడానికి ఎవ్వరు ఇష్టపడని తరుణంలో ఆ అమ్మాయి తనని చూడడానికి రావడంతో ఆమెపై ఇష్టం పెంచుకుంటుంది. ఆ తర్వాత థెల్మా, అంజా ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు.

ఓ రోజు అంజా తన ఫ్రెండ్స్ తో కలిసి చేసుకుంటున్న పార్టీకి థెల్మాను తీసుకెళ్తుంది. ఆ సమయంలో అనుకోకుండా గంజాయిని తాగేసరికి థెల్మా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ టైంలో థెల్మాకు వింత వింత ఊహలు మొదలవుతాయి. ఆ తర్వాత డాక్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ విషయాన్నీ తెలుసుకుంటుంది. తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏవో టాబ్లెట్స్ ఇస్తున్నారనే విషయమే కాకుండా అంజాను తానే కంట్రోల్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మరో డాక్టర్ ని కలిస్తే థెల్మాకు సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్తాడు. ఈ నేపథ్యంలోనే థెల్మా చుట్టూ ఉండే వారికి ప్రమాదాలు జరుగుతాయి. ఇక అందరికీ దూరంగా ఉండాలి అనుకుని ఇంటికి వెళ్తే ఏకంగా కన్న తల్లిదండ్రులే ఆమెను చంపడానికి ప్లాన్ చేస్తారు. మరి ఇంతకీ థెల్మా విషయంలో అసలు ఏం జరుగుతోంది ? ఎందుకు సొంత తల్లిదండ్రులే కూతురును చంపాలనుకుంటున్నారు ? చివరికి ఏం జరిగింది? తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు