Munjya OTT Platform : కామెడీ హార్రర్ మూవీ ముంజ్యా ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోందో తెలుసా?

Munjya OTT Platform : ఒకప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు టీవీలో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని చాలా కాలం ఎదురు చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఆ సస్పెన్స్ కు త్వరగానే తెర పడుతోంది. సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి పట్టుమని 15 – 20 రోజులు కూడా కాకముందే ఓటిటిలోకి అడుగు పెడుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఏ ఓటిటితో డీల్ సెట్ చేసుకున్నాయి? ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనే విషయాలను ముందుగానే సెర్చ్ చేస్తున్నారు నెటిజెన్లు. తాజాగా హర్రర్ మూవీ ముంజ్యా ఓటిటి పార్ట్నర్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. మరి ఈ హర్రర్ అండ్ కామెడీ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందో చూసేద్దాం పదండి.

ముంజ్యా ఓటీటీ పార్టనర్ ఎవరంటే?

మిడ్ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన తాజా బాలీవుడ్ మూవీ ముంజ్యా. హారర్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకుల చేత హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ డిఫరెంట్ స్టోరీతో రూపొందింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో దెయ్యాలను కామెడీగా చూపించడంతో పాటు యాక్షన్స్ తోనే నవ్వించేలా ప్లాన్ చేశారు. ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ తాజాగా బయటకు వచ్చాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ ఓటీపీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీని డిస్నీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ముంజ్యా మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

Munjya' advance box office: Sharvari Wagh, Mona Singh starrer expected to  earn Rs 1.5 crore on Day 1, releasing in 1600 screens | Hindi Movie News -  Times of Indiaముంజ్యా స్టోరీలోకి వెళ్తే…

అభయ్ వర్మ అని వ్యక్తి చుట్టూ ఈ మూవీ స్టోరీ అంతా నడుస్తుంది. అభయ్ తల్లి అతి జాగ్రత్త అతనికి స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. తనకు నచ్చినట్టుగా ఆమె ఉండనివ్వదు. అతనేమో స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. ఇంకేముంది ఇద్దరూ కలిసి తమ ఊర్లో జరిగే ఓ పెళ్లికి వెళ్తారు. ఇదే టైం అన్నట్టుగా ముంజ్యా అనే ఒక పిల్ల దయ్యం తన కోరికను తీర్చుకోవడానికి అభయ్ వెంట పడుతుంది. అతనికి మాత్రమే కనిపిస్తూ టార్చర్ పెడుతుంది. ఇంతకీ ఈ ముంజ్యా అనే దయ్యం ఎవరు ? అది ఆ అబ్బాయినే ఎందుకు టార్గెట్ చేసింది? దాని నుంచి అభయ్ ఎలా బయటపడ్డాడు? అనేది ఈ మూవీ స్టోరీ.

- Advertisement -

మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ అతీంద్రియ హారర్-కామెడీలో శర్వరి, అభి వర్మ, మోనా సింగ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. పెద్దగా ఫేమ్ ఉన్న స్టార్స్ ఒక్కరు కూడా ఈ సినిమాలో నటించకపోయినా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీగానే కలెక్షన్లు కూడా రాబడుతోంది. మౌత్ టాక్ తోనే ఈ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చే అవకాశం ఉంది. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు