Jr.NTR: ఎన్టీఆర్ నే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఏకంగా 3 సార్లు.. కట్ చేస్తే..!

Jr. NTR.. ప్రస్తుత కాలంలో బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియాలో సత్తా చాటుతూ అందరి దృష్టిలో పడుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నారు.. చేస్తే పాన్ ఇండియా సినిమాలే కానీ అసలు లోపల సినిమాలు చేయమని భీష్మించుకు కూర్చున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కూడా అలా అయిపోయింది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దీనికి కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా తీసుకొచ్చిన ఇమేజ్ అని చెప్పవచ్చు.

బాలీవుడ్ ఎంట్రీ..

ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఆ తర్వాత కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.. ఈ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. అలాగే హిందీలో కూడా వార్ 2 చిత్రంతో లాంఛ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక అలా అటు నార్త్ ఇటు సౌత్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

ఎన్టీఆర్ మూవీనే రిజెక్ట్ చేసిన అలియా..

Jr.NTR: Star heroine rejected by NTR.. 3 times at once.. If cut..!
Jr.NTR: Star heroine rejected by NTR.. 3 times at once.. If cut..!

ఇకపోతే ఎన్టీఆర్ తో సినిమా అంటే ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు ఎవరైనా సరే ఎగిరి గంతేయాల్సిందే.. ప్రస్తుతం తారక్ చేస్తున్న దేవరా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా అవకాశం దక్కించుకుంది.. అయితే ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటే.. ఒక బాలీవుడ్ హీరోయిన్ మాత్రం రిజెక్ట్ చేసింది..అందులోనూ మూడుసార్లు రిజెక్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ సినిమానే రిజెక్ట్ చేసిన బ్యూటీ ఎవరు అంటే..ఆమె ఎవరో కాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నాచురల్ బ్యూటీ అలియా భట్..

- Advertisement -

అవకాశం వచ్చినా.. నటించలేదు..

ఈమెకు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఏకంగా మూడుసార్లు వచ్చినా.. వివిధ రకాల కారణాల వల్ల ఛాన్స్ వదులుకోనుందని తెలుస్తోంది. కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ రిజెక్ట్ చేసింది. చివరిగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమాలో కూడా రాంచరణ్ కు జోడీగా మాత్రమే నటించింది అలియా భట్.. ఇక మరోవైపు దేవర సినిమాలో అలియా భట్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు కానీ అప్పటికి ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో సినిమా నుంచి తప్పుకుంది.. దాంతో ఈ అవకాశం శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి లభించింది. ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన తల్లి కోరికను కూడా నెరవేర్చుకుంది జాన్వీ కపూర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు