Mirzapur Season 3 : ఎట్టకేలకు సస్పెన్స్ కు తెర… మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Mirzapur Season 3 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో ఒకటైన ‘మీర్జాపూర్ 3’ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అద్భుతమైన మొదటి రెండు సీజన్ల తర్వాత గుడ్డు భయ్యా, కాలిన్ భయ్యాలను మరోసారి తెరపై చూడటానికి ఓటీటీ లవర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సిరీస్ రిలీజ్ డేట్ పై ఇప్పటిదాకా ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈరోజు అభిమానులకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ రిలీజ్ డేట్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

మీర్జాపూర్ రిలీజ్ డేట్ అవుట్

‘మీర్జాపూర్ 3’ నిర్మాతలు కొత్త పోస్టర్‌తో విడుదల తేదీని ప్రకటించడమే కాకుండా, గాయపడిన సింహం మరోసారి అడవిలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉందని కొత్త టీజర్‌తో చెప్పారు. ఈ చిత్రం కొత్త టీజర్ ను చూసిన అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ నెలలోనే పలు మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు ప్రేక్షకులకు వరుసగా సర్ప్రైజ్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే కోట ఫ్యాక్టరీ ట్రైలర్ రిలీజ్ కాగా, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్‌లలో ఒకటైన ‘మిర్జాపూర్ 3’ విడుదల తేదీ వెల్లడైంది. అయితే గత కొంతకాలంగా ‘మీర్జాపూర్’ మేకర్స్ ఈ సిరీస్ విడుదలకు సంబంధించిన సస్పెన్స్‌ను ఒక పజిల్ లాగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ సస్పెన్స్ కు తెర దించి, రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

Mirzapur Season 3 release date announced, Gabban ka Akhara will return with a bang from July 5! - Times Bull

- Advertisement -

కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ‘మీర్జాపూర్ 3’ వెబ్ సిరీస్ రిలీజ్ కోసం ఏర్పాట్లు జరిగాయి. MirzapurOnPrime జూలై 5న రిలీజ్ కాబోతోంది అంటూ ‘మీర్జాపూర్’ కుర్చీతో పాటు ప్రధాన నటులను పోస్టర్‌లో చూపించారు. అందులో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగ్గల్, శ్వేతా త్రిపాఠి, విజయ్ వర్మ వంటి తారలు కనిపిస్తున్నారు. కానీ గుడ్డు భయ్యా పోస్టర్‌లో లేడు అంటూ అభిమానులు మిస్ అవుతున్నారు. ‘కాలిన్ భయ్యా’, ‘గుడ్డు పండిట్’ మధ్య జరిగే ఈ పోరులో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే జూలై 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న మీర్జాపూర్ సీజన్ 3 ని చూడాల్సిందే.

240 దేశాలలో స్ట్రీమింగ్

గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ ను ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పై నిర్మించారు. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్, రాజేష్ తైలాంగ్, షీబా చద్దా, మేఘనా మాలిక్, మను రిషి వంటి నటినటులు నటించారు. ఈ 10-ఎపిసోడ్ల  సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఇండియన్ ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈసారి మీర్జాపూర్ ఊహా లోకపు సింహాసనంపై ఎవరు కూర్చోబోతున్నారనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎవరికీ చేతకాని మిర్జాపూర్ సింహాసనంపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే పోరాటంలో వారు గెలుస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు