OTT Movie : లేక్ లో నుంచి అబ్బాయిని ఆ పని కోసం పిలిచే లేడీ దెయ్యం… ఆమె ఎవరో అస్సలు ఊహించలేరు

0
38
ott-movie-Mermaid: The Lake of the Dead movie streaming on amazon prime video
ott-movie-Mermaid: The Lake of the Dead movie streaming on amazon prime video

OTT Movie : ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ సజెషన్ ను మూవీ లవర్స్ కోసం తీసుకొచ్చాం. టైటిల్ లో చెప్పినట్టుగానే లేక్ లో నుంచి అబ్బాయిని ఆ పని కోసం పిలిచే ఓ లేడీ దయ్యం స్టోరీ ఇది. అయితే ఆమె ఎవరో సినిమాలో రివీల్ అయ్యేదాకా ఊహించడం కష్టమే. మరి ఇంకెందుకు ఆలస్యం మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ టైటిల్ ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు మెర్మైడ్ లేక్ ఆఫ్ ది డెడ్. హర్రర్ సినిమాల్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ తో పాటు డైరెక్టర్ మరింత క్రియేటివ్ గా తీర్చిదిద్దాడు ఈ మూవీని. ప్రతి దయ్యానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండడం, దాని కంట్రోల్ చేయడానికి ప్లాన్ ఉండడం వంటివి ఈ సినిమాలో కూడా చూడొచ్చు. అయితే కాస్త డిఫరెంట్ గా దాన్ని చూస్తాము. ఇక్కడ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విషయం ఏమిటంటే ఈ మూవీ రష్యన్ భాషలో తెరకెక్కింది. అయితే ఓటిటిలో ఇంగ్లీషులో కూడా అందుబాటులో ఉంది. భాష అడ్డు కాదనుకునే ప్రేక్షకులు ఈ మూవీని రెండు ఓటీటీల్లో చూడొచ్చు. ప్రస్తుతం ది మర్మైడ్ లేక్ ఆఫ్ ది డెడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆపిల్ టీవీ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Win Mermaid Lake of the Dead DVD – We Love Movies

కథలోకి వెళితే…

ఓ లేక్ లో ఉండే దయ్యం అబ్బాయిలను స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తుంది. లేక్ లో నుంచి బయటకు వచ్చే ఆ దయ్యం కనిపించిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. చేసుకుంటాము అన్నారో చచ్చారే. లేదు చేసుకోము అన్నాగాని చావాల్సిందే. ఇక సినిమా మొదట్లో ఇద్దరు భార్య భర్తలు లేక్ వైపు చూస్తుండగా హఠాత్తుగా భర్తను లేక్ లోకి లాగేసుకుంటుంది దయ్యం. అతన్ని కాపాడే క్రమంలో భార్య చనిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మరీనా, రోమా ఇద్దరూ ప్రేమ పెళ్లికి రెడీ అవుతారు. ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడానికి రోమా తన తండ్రికి చెందిన ఒక లేక్ హౌస్ కి వెళ్తాడు. అయితే అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రోమా ఆ లేక్ దగ్గరకు వెళ్లి స్విమ్మింగ్ చేస్తాడు. ఆ టైంలో అక్కడికి ఓ అమ్మాయి రాగా ఆమెను చూసి మైమరిచిపోతాడు. ఆమెకు ముద్దు పెట్టి స్పృహ తప్పి పడిపోతాడు.

ఆ తర్వాత రోమా లవర్ కి ఈ విషయం తెలుస్తుంది. అలాగే అతని బట్టల్లో ఒక దువ్వెన కూడా దొరుకుతుంది. అప్పటి నుంచి రోమా తను లేక్ దగ్గర చూసిన అమ్మాయిని ఊహించుకుంటూ తనంటేనే ఇష్టమని, నువ్వు ఇష్టం లేదని లవర్ కు మొహం మీద చెప్పేస్తాడు. ఇంతకీ రోమా దగ్గరకు వచ్చిన ఆ అమ్మాయి ఎవరు ? రోమా ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది ? ఆ దయ్యం వారి నుంచి రక్షించుకోవడానికి రోమా లవర్ ఏం చేసింది? అనేది తెరపై చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here