Ram pothineni: రామ్ పోతినేని ” డబల్ ఇష్మార్ట్ ” షూటింగ్ పై క్రేజీ అప్డేట్..!

Ram pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరైన రామ్ పోతినేని తాజాగా నటిస్తున్న చిత్రం డబల్ ఇష్మార్ట్. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. సూపర్ హిట్ అయినా ఇష్మార్ట్ శంకర్ కి ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

కావ్య థాపర్ కథానాయకగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ప్రజెంట్ షూటింగ్ దశలో ఉంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం హైదరాబాదులో రెండు పాటలు అండ్ గోవాలో మరొక పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

'Ram Pothineni' double smart movie has crossed the budget limits

- Advertisement -

ఈ పాటలు మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి, పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు