OTT Movie : ఐదుగురు భార్యలతో హనీమూన్ ఎలా ఉంటదో ఎప్పుడైనా ఊహించారా? ఈ సినిమాను చూసి తెలుసుకోండి

OTT Movie : పెళ్లి హనీమూన్ అనగానే ఒక అందమైన ప్రేమ జంట కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. కానీ ఎప్పుడైనా ఊహించారా ఐదుగురు భార్యలతో ఓ భర్త హనీమూన్ చేసుకుంటే ఎలా ఉంటుందో? ఈ స్టోరీ లైన్ తోనే ఓ హిలేరియస్ వెబ్ సిరీస్ రాబోతోంది. మరి ఆ వెబ్ సిరీస్ పేరేంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

నాగేంద్రన్స్ హనీమూన్స్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం వెబ్ సిరీస్ పేరు నాగేంద్రన్స్  హనీమూన్స్. డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు ఈ సిరీస్ తో ఓటిటి ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడు. కామెడీ కథతో ఫస్ట్ టైం వెబ్ సిరీస్ లో చేస్తున్నాడు సూరజ్. ఈ సిరీస్లో సూరజ్ తో పాటు ఆల్ఫీ పంజిక‌ర‌న్‌, నిరంజ‌న అనూప్, గ్రేస్ ఆంటోనీ, క‌నికుశృతి, శ్వేత మీన‌న్‌ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. వన్ లైఫ్ ఫైవ్ వైఫ్స్ అంటూ పోస్టర్ పై ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో సూరజ్ భయం భయంగా కూర్చుని కనిపించగా, ఐదుగురు ఫిమేల్ లీడ్ యాక్టర్స్ ఆయన చుట్టూ ఉండడం చూడొచ్చు. ఇందులో ఐదుగురు భార్యలున్న భర్తగా సూరజ్ నటించబోతున్నాడు. కానీ ఏకంగా ఐదుగురు భార్యలతో కలిసి భర్త హనీమూన్ ప్లాన్ చేయడం ఏంటి? ఈ ట్రిప్ లో అతను ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎందుకు ఐదు మందిని పెళ్లి చేసుకున్నాడు ? అనే ఇంట్రెస్టింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను చూడడానికి మూవీ లవర్స్ క్యూరియస్ గా ఉన్నారు.

- Advertisement -

Nagendran's Honeymoons: Suraj Venjaramoodu, Grace Antony and Kani Kusruti's  Malayalam Series To Release On Disney+ Hotstar! (Check New Poster) | 🎥  LatestLY

ఇక నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రాబోతోంది. ఒకేసారి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ఈ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేసింది. జూన్ మొదటి వారంలో ఈ మలయాళ కామెడీ సిరీస్ ఓటీటీలోకి రాబోతోందని టాక్ నడుస్తోంది.

డిస్నీ ఫేవరెట్ డైరెక్టర్…

నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరిస్ కు నితిన్ రెంజీ ఫనిక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆయనను డిస్నీ ఫేవరెట్ డైరెక్టర్ అని ఎందుకన్నామంటే ఆయన ఇప్పటిదాకా తెరకెక్కించిన మూడు సిరీస్ లు కూడా డిస్నీలోనే రిలీజ్ అయ్యాయి. గతంలో ఈ దర్శకుడు మలయాళంలో తెరకెక్కించిన కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిలోర్ ప్రీమియర్ లీగ్ అనే వెబ్ సిరీస్ లు డిస్నీ లో స్ట్రీమింగ్ కావడం విశేషం. ముచ్చటగా మూడు సిరీస్ లు అయిపోయాయి. ఇప్పుడు నాలుగో సిరీస్ కూడా డిస్నీలోనే స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సిరీస్ ఓటిటీలోకి ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు