OTT : రేపు ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు

సినిమాలు.. థియేటర్స్ లో రిలీజ్ అవుతన్న దానికంటే, ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఉండే ఉత్సహమే వేరు. చాలా మంది సినీ లవర్స్, సినిమాలను థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడరు. కానీ, ఓటీటీల్లో చూడటానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్లోనే హాయ్ గా కూర్చిండి చూస్తారు. ఇది కరోనా మహమ్మారి నుండే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కాగా రేపు ఓటీటీ ప్లాట్ ఫాంలలో పలు సినిమాలు స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..

టాలీవుడ్ క్వీన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటించిన “కాతువాకుల రెండు కాదల్” మూవీ. ఇదే మూవీ తెలుగులో “కణ్మణి రాంబో ఖతిజ” కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

- Advertisement -

హాలీవుడ్ స్టార్స్ నటించిన “ఒబి-వాన్ కేనోబి” సిరీస్ నుండీ ఎపిసోడ్స్ కూడా హాట్ స్టార్ లోనే రిలీజ్ కానున్నాయి.

హీరో సిద్ధార్థ్ చేసిన “ఎస్కేప్ లైవ్” వెబ్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్స్ కూడా రేపటి నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగ ఇప్పటికే హాట్ స్టార్ లో 7 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. రేపటి నుండి మరో రెండు ఎపిసోడ్స్ స్ట్రిమింగ్ కానున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో..

హాలీవుడ్ లో ఎంతో పేరు గాంచిన “స్ట్రేంజర్ థింగ్స్” సిరీస్ నాలుగో సీజన్ రేపటి నుండే అందుబాటులోకి రానుంది.

ఆహాలో..

కోలీవుడ్ విలక్షణ నటుడు సముథ్రకని కీలక పాత్రలో నటించిన “రైటర్” మూవీ కూడా రేపే స్ట్రిమింగ్ కానుంది. ఈ మూవీ ముందుగా తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రస్తుతం తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు