కొన్ని అవకాశాలు రావాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి
మన ఆలోచనలతో మనమే యుద్ధం చెయ్యాలి
అలా కాగితం పై పుట్టిన అక్షరం వెండితెరపై చిత్రం అవ్వాలంటే ఎన్నో దాటుకుని రావాలి. అన్ని దాటుకుని వచ్చిన తరువాత మనకు వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా వినియోగించుకోగలగాలి.
అప్పుడే సక్సెస్ మనకు చేరువవవుతుంది, ఫెయిల్యూర్ మనకు దూరమవుతుంది. అదే ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఇంకో అవకాశం పట్టుకోవడం కష్టం అవుతుంది.
గమ్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి. కొన్ని విభిన్నమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ తో “హరి హర వీర మల్లు” అనే భారీ పీరియాడిక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అటువంటి క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ & గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.
కానీ ఈ సినిమా సంబంధించిన కొంత రష్ చూసిన పవన్ కళ్యాణ్ వచ్చిన ఔట్పుట్ తో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
కొన్నిచోట్ల చూడటానికి శక్తీ సినిమాలో ఎన్టీఆర్ లా కనిపిస్తున్నారని, ఈ ఫుటేజ్ బయటకు వస్తే పవన్ కళ్యాణ్ ట్రోల్ కావడం ఖాయమని, నెక్స్ట్ జరగబోయే రెండు షెడ్యూలను కాన్సల్ చేసి మళ్ళీ రీషూట్ కి వెళ్లనున్నట్లు గట్టిగ వార్తలు వినిపిస్తున్నాయి.