“అఖండ” విజయం తర్వాత నందమూరి బాలయ్య వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. తనకు సెట్ అయ్యే మాస్ ఎలివేషన్స్ తో కూడిన స్టోరీలను డైరెక్టర్స్ తో సిద్ధం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం గోపిచంద్ మలినేని తో “NBK107” వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు గోపిచంద్.
తెలంగాణ రాష్ట్రాంలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమా టైటిల్ కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.
అందులో “అన్న గారు” ఒకటి. డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ టైటిల్ ను బాలయ్యకు సూచించడాని, దానికి బాలయ్య కూడా అంగీకరించాడాని వార్తలు వచ్చాయి. కాగా, ఎన్టీ రామరావు ను అన్న గారు అని అందరూ పిలిచే వారు. అందుకు గుర్తుగా ఈ పేరును వాడుతున్నారని అనుకున్నారు.
కానీ, ప్రస్తుతం మరో టైటిల్ తెర పైకి వచ్చింది. గోవిచంద్ – బాలయ్య సంయుక్తంగా “జై బాలయ్య” అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అతి త్వరలోనే దీన్ని అధికారికంగ ప్రకటించే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి.
బాలయ్యను చూడగానే, ఆయన మార్క్ సీన్స్ సినిమాల్లో వచ్చిన వెంటనే, ఆయన ఫ్యాన్స్ నోట్లో నుండి వచ్చే పదం.. జై బాలయ్య. ఫ్యాన్స్ ఊత పదాన్ని క్యాష్ చేసుకోవడానికి డైరెక్టర్ ఈ టైటిల్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీ టైటిల్ అయినా వాస్తవమేన అని ఫ్యాన్స్ అంటున్నారు. ఒక వేళ ఈ మూవీ టైటిల్ ఫిక్స్ అయితే బాలయ్య నందమూరి ఫ్యాన్స్ కు ఇక పునకాలే.