సమంత వల్ల ‘పుష్ప’ హిట్ అవ్వడం ఏంటి? ఈ కామెంట్ వింటుంటే కామన్ ఆడియన్స్ కే కోపం వస్తుంటుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది. అందుకే ఆ కామెంట్ చేసిన సీనియర్ నటుడుని ఏకి పారేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ సీనియర్ నటుడు? అనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. అతను మరెవరో కాదు భానుచందర్. ఇటీవల ఈయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా అతను ఇలాంటి కామెంట్స్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. “హిందీ సినిమాలను మన సౌత్ సినిమాలు డామినేట్ చేసే స్థాయికి ఎదిగాయి. సౌత్ నుండీ పాన్ ఇండియా సినిమా విడుదల అవుతుంది అంటే అక్కడి జనాల్లో టెన్షన్ మొదలవుతుంది. ఈ మధ్యన వచ్చిన ‘పుష్ప’ అక్కడ ఎంత సంచలనం సృష్టించిందో అందరం చూశాం. సమంత ఆ సినిమాలో ‘ఉ అంటావా ఉఊ అంటావా మావ’…అనే సాంగ్ వల్లనే ఆ సినిమా అక్కడ అంత పెద్ద హిట్ అయ్యింది. ఆ పాట అన్ని లాంగ్వేజెస్‌లో మార్మోగింది” అంటూ భానుచందర్ కామెంట్స్ చేశాడు.
ఎంతో అనుభవం కలిగిన భానుచందర్ ఇలాంటి కామెంట్స్ చేయడం బన్నీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు. అతని మేనరిజమ్స్ వల్లే సినిమా అక్కడి జనాలకి రీచ్ అయ్యింది. ఒక్క ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన సమంత వల్ల హిట్ అయ్యింది అంటే ఎలా అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.