Thalapathy 66 : వంశీ పైడిపల్లి.. మళ్ళీ కాపీనా…?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతను తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కుతుంది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌’ ‘పీవీపీ’ బ్యానర్ల పై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి… ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ ఇదని.. ఇందులో భాగంగా కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టు చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పిక్ ను షేర్ చేసింది ‘తలపతి 66’ చిత్ర బృందం.

ఈ పిక్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి హీరో విజయ్ ఉన్నారు. అయితే విజయ్ లుక్ ‘మహర్షి’ ఫస్ట్ షెడ్యూల్ మొదలైనప్పుడు రిలీజ్ చేసిన పిక్ ఒకేలా ఉన్నాయట. ఈ రెండు ఫోటోలను పక్క పక్కనే పెట్టి నెటిజన్లు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ‘వంశీ పైడిపల్లి మళ్ళీ కాపీ కొట్టేస్తున్నాడు’ అంటూ విమర్శిస్తున్నారు. పాత కథల్నే కొంచెం అటూ ఇటూగా మార్చి కొత్త సినిమాగా తీర్చిదిద్దుతూ ఉంటాడు వంశీ పైడిపల్లి అనే ముద్ర కూడా ఇతని పై ఉంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు